AP Rains: ఏపీలో వర్షాలే వర్షాలు బుల్లోడా.! ముఖ్యంగా ఆ ప్రాంతాలకు..

|

Aug 15, 2024 | 7:02 PM

నిన్నటి ద్రోణి దక్షిణ తెలంగాణ నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకుని ఉన్న కేరళ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఈరోజు కొంకణ్ నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని దక్షిణ కేరళ తీరం మీదుగా..

AP Rains: ఏపీలో వర్షాలే వర్షాలు బుల్లోడా.! ముఖ్యంగా ఆ ప్రాంతాలకు..
Ap Rains
Follow us on

నిన్నటి ద్రోణి దక్షిణ తెలంగాణ నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకుని ఉన్న కేరళ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఈరోజు కొంకణ్ నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని దక్షిణ కేరళ తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్నది.

—————————————-
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
————————————————

ఈరోజు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
————————————–

ఈరోజు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ :-
—————-

ఈరోజు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..