Rain Alert: అబ్బబ్బ.! ఆంధ్రాలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. ఈ జిల్లాలకు కుండబోత

వచ్చేశాయ్‌... వానలొచ్చేశాయ్‌...! ఏపీలో మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. వరుణుడి ప్రతాపం షురూ అయ్యింది..! ఇక ఇప్పటి నుంచి వాతావరణంలో మార్పులు జరగబోతున్నాయి. రాజస్థాన్‌ పరిసరాల్లో కొనసాగుతున్న వాయుగుండంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఆ వివరాలు ఇలా

Rain Alert: అబ్బబ్బ.! ఆంధ్రాలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. ఈ జిల్లాలకు కుండబోత

Updated on: Jul 24, 2025 | 2:03 PM

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు (జూలై 24, 2025) ఉదయం 0830 గంటల సమయానికి ఉత్తర బంగాళాఖాతం మధ్య భాగాలపై ఉంది. అనుబంద ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్ దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉంది.

సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు శ్రీ గంగానగర్, సిర్సా, మీరట్, హర్దోయ్, పాట్నా, జంషెడ్‌పూర్, దిఘా గుండా వెళుతూ అక్కడి నుండి ఉత్తర బంగాళాఖాతం మధ్య భాగాలపై ఉన్న అల్పపీడన ప్రాంతము నకు ఆగ్నేయ దిశగా కదులతుంది. ద్రోణి ,విదర్భ నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర బంగాళాఖాతం మధ్య భాగాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో అల్పపీడన ప్రాంతంతో అనుబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతోంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
—————————————————————————————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————

ఈరోజు :-
————————————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది.
భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు :-
—————————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-
—————–

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————–

ఈరోజు, రేపు :-
—————————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు,  బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-
—————–

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

రాయలసీమ :-
——————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-
—————————————

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..