AP Weather Report : బంగాళఖాతంలో మరో అల్పపీడనం.. రానున్న 3 రోజులపాటు ఏపీలో ఓ మోస్తారు వర్షాలు..!

|

Jul 26, 2021 | 3:16 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణం శాఖ వెల్లడించింది.

AP Weather Report : బంగాళఖాతంలో మరో అల్పపీడనం.. రానున్న 3 రోజులపాటు  ఏపీలో ఓ మోస్తారు వర్షాలు..!
Weather
Follow us on

Moderate Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణం శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తుల మధ్య ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు పయనిస్తుంది. దీని ప్రభావంతో 28 జూలై 2021 తేదీన ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుండి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటు యానాంలో ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.

దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల భారీ కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. అటు రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Read Also….  Andhra Pradesh: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని..