Tadipatri fight : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘గొడవ పెట్టుకోవాలి అనుకుంటే రా.. తేల్చుకుందాం.. మీ కుటుంబం అంతా రండి.. మా కుటుంబం అంతా వస్తాం.. ఎవరో ఒకరు మిగులుతారు.. అప్పుడు ఊరు ప్రశాంతంగా ఉంటుంది. మరోసారి మా కుటుంబం గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. జేసీ ప్రభాకర్ రెడ్డిపైనే కాదు.. నాపైనా కేసులు పెట్టారు. మా ప్రభుత్వంలో వాళ్లు వీళ్లు అన్న తేడా లేదు. తాడిపత్రిలో ఈ రోజే ప్రజాస్వామ్యం ఖూనీ కాలేదు. 30 ఏళ్ల క్రితమే ఇక్కడ ప్రజాస్వామ్యం పోయింది. తాడిపత్రిని సొంత దీవిలా జేసీ బ్రదర్స్ భావిస్తున్నారు. తాడిపత్రికి వాళ్లు మకుటం లేని మహారాజులం అనుకుంటున్నారు. నా కుటుంబంపై వాళ్లు ఏదైనా ఆలోచన చేస్తే నేనూ అదే చేస్తా. నేను కేవలం మాట్లాడేందుకే వెళ్లాను. ఇన్నాళ్లు చర్చలకే కట్టుబడి ఉన్నాను. ఇకపై ఏదైనా తేల్చుకోవడానికి సిద్ధమే’ అంటూ పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
Also read:
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగిస్తూ ప్రకటన జారీ.. షరతు విధింపు