Andhra Pradesh: త్వరలోనే ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానం.. మంత్రి విడదల రజినీ కీలక ప్రకటన

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:11 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్య విధానాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) చేతుల....

Andhra Pradesh: త్వరలోనే ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానం.. మంత్రి విడదల రజినీ కీలక ప్రకటన
Vidadala Rajini
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్య విధానాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతున్నయో తెలుసుకునేందుకు ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్య విధానం అమల్లోకి వస్తే.. ఇంటింటికి ప్రభుత్వమే వైద్యసేవలు అందిస్తుందని చెప్పారు. ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం కొత్తగా సిబ్బందిని నియమించుకుంటామని చెప్పారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లలో 65 రకాల మందులు అందుబాటులో ఉంచామన్న మంత్రి (Vidadala Rajini).. వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా ప్రత్యేక యాప్‌లనూ అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. ఎంఎంయూ వాహనాలను 45 రోజుల్లో సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.

పేదవారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటైన ఆరోగ్యశ శ్రీ పరిధిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరింతగా పెంచారు. ఉచితంగా కార్పొరేట్‌ వైద్యాన్ని అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన వారికి ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్యవిధానం ద్వారా అదనంగా వైద్యసేవలు అందుతాయి. వైద్యులు, ఏఎన్‌ఎంలు వారి ఇళ్లకు వెళ్లి సేవలందిస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందిన బాధితులు సేవల పట్ల సంతృప్తి చెందకపోతే ఫిర్యాదు చేయాలి. తద్వారా ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. పీహెచ్‌సీల్లో నెలకు కనీసం పది డెలివరీలు అయినా చేయాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మాతా శిశు మరణాలు సున్నాకు తగ్గాయి.

– విడదల రజినీ, ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. ఆరోగ్య శ్రీ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్‌లో చెల్లింపులు జరగాలని సీఎం జగన్ గతంలో అధికారులకు ఆదేశించారు. పేషెంటు డిశ్చార్జి అయ్యే సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలని సూచించారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు సీఎం కు వెల్లడించారు.