Minister Roja: కొడాలి నాని, నేను టీడీపీ నుంచి అందుకే బయటికొచ్చాం.. మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

|

Sep 20, 2022 | 2:18 PM

కొడాలి నాని, ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి భయపెడతాం అంటే సహించమని.. టీడీపీ వాళ్లు ఎలా  పనులు చేశారో చూశామన్నారు రోజా. గతంలో మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టారో, అంబటి రాంబాబు ఇంటి మీదకు పోయారో చూశామని..

Minister Roja: కొడాలి నాని, నేను టీడీపీ నుంచి అందుకే బయటికొచ్చాం.. మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
Minister Rk Roja
Follow us on

Minister Roja: ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్న చందంగా కొనసాగుతుంది. తాజాగా టీడీపీ నేతల తీరుపై పర్యాటక మంత్రి ఆర్కే రోజా  తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ హద్దులు దాటి మాట్లాడితే.. ఊరుకోమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు వంటి వారు కొడాలి నాని, అంబటి రాంబాబు ఇళ్ల మీదకు వస్తారా..? అసలు .. కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుకను కూడా టీడీపీ వాళ్లు పీకలేరంటూ ఎద్దేవా చేశారు రోజా. భార్య, తల్లితో.. తండ్రిపై ఒత్తిడి తెచ్చి దొడ్డిదారిన లోకేశ్‌ ఎమ్మెల్సీ, మంత్రి అయ్యాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ వారు కేవలం గ్రాఫిక్స్ చూపించారు.. కనుక అమరావతిలోనూ వైయస్‌ఆర్‌సీపీ గెలిచిందన్నారు రోజా. మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలా? అమరావతి కావాలో ప్రజల్లోకి వెళ్లండని టీడీపీ నేతలకు సూచించారు రోజా. అసలు రాజధాని అమరావతిలోని 29 గ్రామాల ప్రజలు వైసీపీ జెండా తీసివేస్తే.. రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజలు టీడీపీని కూకటివేళ్లతో పెరికేస్తారంటూ జోస్యం చేశారు మంత్రి రోజా. అసలు  ఆడవాళ్లను ప్రజల్లోకి వెళ్లి ప్రశ్నించలేని లోకేశ్, అసెంబ్లీకి రాలేని చంద్రబాబు మాపై విమర్శలేంటి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రజల్ని రెచ్చగొట్టి అందరి సమాయాన్ని వృధా చేసే కార్యక్రమాన్ని చేయొద్దు. లా అండ్ ఆర్డర్‌కు సమస్యలు వచ్చే కార్యక్రమం చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలోకి ప్రజలు అడుగుపెట్టనివ్వరన్నారు మంత్రి రోజా.

టీడీపీ 5 ఏళ్ళపాటు అధికారంలో ఉండి, కేవలం పచ్చ మీడియాలో గ్రాఫిక్స్‌ చూపించబట్టే  అమరావతి  ఉన్న రెండు ఎమ్మెల్యే సీట్లను 2019లో వైయస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో రైతులకు, ప్రజలకు న్యాయం చేయలేదని గుర్తించబట్టే వైయస్‌ఆర్‌సీపీని గెలిపించారు. పనికిమాలిన టీడీపీ వాళ్లు వైసిపీని గద్దెను, ప్రభుత్వాన్ని కదిలించేస్తామంటున్నారు. 29 గ్రామాల్లో మీరు, మీ బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి.. 26 జిల్లాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికి ఎవ్వరూ ఒప్పుకోరన్న సంగతి టీడీపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు రోజా..

మహానేత వైయస్‌ఆర్‌ ని కాంగ్రెస్ అవమానిస్తే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు వచ్చి.. ఎన్నికలకు వెళ్తే ప్రజలంతా వైయస్‌ఆర్‌సీపీకి అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఆ ఎంపీలకు ప్రజలు మద్దతుగా నిలిచారు. అదేవిధంగా టీడీపీ వాళ్లు అమరావతినే మూడు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారని కోరితే మేం ఎందుకు రాజీనామా చేయాలి. టీడీపీ వాళ్లు రాజీనామా చేసి మూడు ప్రాంతాలు కావాలా? అమరావతిలోనే అభివృద్ధి చాలా అంటే ఆరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుందని సూచించారు.

ఇవి కూడా చదవండి

ప్రతిసారీ సీఎం జగన్ ని రాజీనామా చేయ్.. అని తరచుగా మాట్లాడితే.. ఊరుకునేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా. సీఎం జగన్ తన సొంత జెండా, అజెండాతో ప్రజల్లో తిరిగి భరోసా కల్పించుకొని తిరుగులేని నాయకుడు అయ్యారు. తాను ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చారు. ప్రతి ఇంట్లో ఒక బిడ్డలా సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు రోజా.

కొడాలి నాని.. తాను టీడీపీ నుంచి వచ్చామని.. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు వచ్చి తన స్వార్థం కోసం పార్టీని, రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశామని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని మాట్లాడిన మాటల్లో ఏం తప్పు ఉంది? . కొడాలి నాని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ఆడవాళ్లను ఇళ్ల మీదకు పంపిస్తారా?  మేమంతా వైసీపీ నాయకుడికి అండగా నిలబడతామని మంత్రి రోజా చెప్పారు.

కొడాలి నాని, ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి భయపెడతాం అంటే సహించమని.. టీడీపీ వాళ్లు ఎలా  పనులు చేశారో చూశామన్నారు రోజా. గతంలో మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టారో, అంబటి రాంబాబు ఇంటి మీదకు పోయారో చూశామని.. టీడీపీ వారు ఏమి చేసినా ఎన్ని చేసినా పోలీసులు వారిని ఏమీ అనకూడదని.. పోలీసులు కేసులు పెట్టకూడదని చెప్పారు. తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తే మాత్రం కక్షసాధింపు చర్యలని టీడీపీ నేతలు గగ్గోలు పెడతారని మంత్రి రోజూ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు ప్రజలకు సేవ చేయటానికి ఉంటే.. టీడీపీ వాళ్లు రౌడీయిజం చేస్తూ.. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ ఇళ్ల మీదకు వెళ్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు మంత్రి రోజా. మరి రోజా వ్యాఖ్యలపై ఆరోపణలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..