Vangaveeti Radha – Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా (Coronavirus) మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీలో మంత్రి, మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి కరోనా బారినపడ్డారు. తాజాగా జరిపించిన కరోనా పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలాఉంటే.. టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ( Vangaveeti Radha) సైతం కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కన్పించగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన కూడా ఏఐజీలో చేరి చికిత్స పొందుతున్నారు. రాధా ఈనెల 9న కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణకు హాజరు కాగా.. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పాల్గొన్నారు. వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని రాధా సూచించారు.
Also Read: