Andhra Pradesh: ఏపీలో అభివృద్ధిపై మంత్రి హరీశ్‌ ఘాటు వ్యాఖ్యలు.. కౌంటర్ వేసిన మంత్రి కారుమూరి

|

Apr 12, 2023 | 2:12 PM

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Andhra Pradesh: ఏపీలో  అభివృద్ధిపై మంత్రి హరీశ్‌ ఘాటు వ్యాఖ్యలు.. కౌంటర్ వేసిన మంత్రి కారుమూరి
Karumuri Nageshwar Rao
Follow us on

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఏపీలో జరిగిన అభివృద్ధిని, తెలంగాణలో జరిగిన అభివృద్ధితో అనుక్షణం పోలుస్తున్న పరిస్థితులు రెండు రాష్ట్రాల మధ్య ఆసక్తికర పరిణామాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి హరీష్ రావు ఏపీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలే అని పేర్కొన్న ఆయన.. ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఏపీ కంటే తెలంగాణ బెటర్ అంటూ వ్యాఖ్యానించారు.

అయితే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తెలంగాణ మంత్రులు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు ఒకసారి ఏపీలోకి వచ్చి చూస్తే తమ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో రోడ్లు సరిగా లేవని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏపీ ప్రజలు మళ్ళీ సీఎం జగనే రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ముందుగా తెలంగాణలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెప్పుకోండి అంటూ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం