Minister Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేయడంపై సెటైర్లు గుప్పించారు. ఈ అంశంలో చంద్రబాబుకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. గతంలో టీడీపీ మేనిఫెస్టోలోని హామీలనే నెరవేర్చని చంద్రబాబు.. మళ్లీ మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజలను మోసం చేసేందుకే మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం నాడు టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు.
చంద్రబాబు కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని, పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. 90శాతం ఏకగ్రీవాలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఏకగ్రీవాలతో పంచాయతీలకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రక్రియలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమారు వ్యవహరిస్తున్న తీరును మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేసేటప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదని అన్నారు.
Also read:
ప్రజల్ని హింసకు రెచ్చగొట్టే టీవీ కార్యక్రమాలకు కళ్ళెం , కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన