Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఓవైపు వికేంద్రీకరణపై చర్చ జరుగుతున్న తరుణంలో.. ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచే పాలన ఉండనుందని తేల్చి చెప్పారు. ఇందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెడతామని మంత్రి తెలిపారు.
విశాఖపట్నం తరలించడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు ప్రారంభమయ్యాయని త్వరలోనే ఇందుకోసం అసెంబ్లీలో బిల్లుపెడతామని తేల్చి చెప్పారు. అయితే ఈ బిల్లు తాజాగా జరుగుతోన్న సమావేశాల్లోనే పెడతారా.. లేదా అన్న విషయంపై మాత్రం మంత్రి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ రాజధాని విషయమై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అమరావతి నిర్మాణం చేసే కోసం రూ. లక్షల కోట్ల రూపాయల్లో 10 శాతం విశాఖపట్నంలో చేస్తే అది మరింత పెద్ద పట్టణంగా మారుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నమే పెద్ద నగరమని జగన్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి అమర్ నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిపాలన విశాఖ కేంద్రంగా సాగనుందన్న వార్తలకు బలం చేకూరినట్లైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..