Seven Hills Express Robbery: ఏపీలో అర్ధరాత్రి దోపిడి కలకలం రేపింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్రవారం అర్దరాత్రి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారం రైలును ఆపి ప్రయాణికుల నుంచి దోపిడీకి పాల్పడ్డారు. అనంతపురం (Anantapur) జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసకుంది. మొదట దుండగులు సిగ్నల్ తీగలను కత్తిరించారు. దీంతో సెవన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ తురకపల్లి స్టేషన్ సమీపంలో ఆగిపోయింది. వెంటనే దుండగులు S5,S7 బోగీల్లోకి చొరబడ్డారు. మారణాయుధాలను చూపి ప్రయాణికుల నుంచి దోచుకున్నారు.
చాలామంది ప్రయాణికుల నుంచి నగదు, బంగారు నగలు లాక్కున్నారు. అయితే.. ఎంత మొత్తం దోపిడీ జరిగిందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. అయితే.. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 9 తులాల బంగారం, పలు వస్తువులు, నగదును దుండగులు దోచుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం తురకపల్లి స్టేషన్ మాస్టర్ రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపినట్లు పోలీసులు తెలిపారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: