YS Viveka Murder Case: దివంగత నేత వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా.. ఈ హత్య కేసులో ఒక్కొక్కరి పేరు నెమ్మదిగా బయటపడుతున్నాయి. అయితే, ఈ కేసులో పేర్లు బయటపడుతుండటంతో.. పులివెందులలో కొందరు భయానక పరిస్థితులు సృష్టించే పరిస్థితులు కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మణికంఠ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పులివెందుల లోని వైఎస్ వివేకా ఇంటి వద్ద మణికంఠ రెడ్డి రెక్కీ నిర్వహించారంటూ ఆయన కూతురు సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మణికంఠ రెడ్డి నుంచి తమకు ప్రాణ హానీ ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు.. మణికంఠ రెడ్డిపై బెండోవర్ కేసు నమోదు చేశారు. జమ్మలమడుగు ఆర్డీఓ వద్ద బైండోవర్ కేసు నమోదు చేయించారు. అంతకుముందు ఉదయం పులివెందుల అర్బన్ పోలీసులు మణికంఠ రెడ్డిని అదుపులోకుని విచారించాడు.
ఇదిలాఉంటే.. వివేకా కూతురు సునీత ఫిర్యాదు, బైండోరవ్ కేసు నమోదు చేయడంపై మణికంఠ రెడ్డి స్పందించారు. తన ఫ్రెండ్ మ్యారేజ్‌కి రూమ్స్ కావాలని వివేకానందరెడ్డి ఇంటి పక్కన ఉన్న వారిని అడిగానని చెప్పుకొచ్చాడు. అయితే, వారు వైఎస్ సునీతను అడగాలన్నారని, పెద్దవారిని అడగలేక వెనుదిరిగి వచ్చానని చెప్పాడు. అంతేతప్ప తనకు వేరే ఉద్దేశం లేదని మణికంఠ రెడ్డి స్పష్టం చేశారు. తమవి చిన్న ప్రాణాలు అని, పెద్దలతో పెట్టుకునే అంత శక్తి తమకు లేదని వ్యాఖ్యానించాడు. ‘‘ఉదయం నుంచి పోలీస్ స్టేషన్, అరెస్ట్, బైండోవర్ కేసులు ఇవన్నీ చూస్తుంటే నాకు ప్రాణహానీ ఉందని భయంగా ఉంది. నాకు రక్షణ కల్పించాలని పోలీసులను అడుగుతున్నాను.’’ అని మణికంఠ రెడ్డి పేర్కొన్నాడు.
Also read:
Earthquake in Haiti: హైతీలో భారీ భూకంపం.. 29 మందికి పైగా మృతి.. శిథిలాల్లో చిక్కుకున్న వందలాదిమంది..
IND vs ENG 2nd Test Day 3: లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు..
Hyderabad City: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అక్కాచెల్లెళ్లు మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు..