Andhra Pradesh: వీడు మామూలోడు కాదు.. ఒంటిపై ఖాకీ డ్రెస్.. చేతిలో వాకీటాకీ.. కట్ చేస్తే..

| Edited By: Shaik Madar Saheb

Jan 28, 2024 | 2:56 PM

పోలీస్ డ్రెస్ లేకుండా జనాలను బెదిరిస్తూ.. నకిలీ పోలీస్‌గా చలామణి అయ్యేవాళ్ళని చాలా సార్లు చూసుంటాం.. కానీ వీడు అంతకుమించి యవ్వారం మొదలెట్టాడు.. ఏకంగా వాకీటాకీలను వాడుతూ జనాలను నమ్మిస్తూ అసలైన పోలీస్‌గా చలామణి అయ్యాడు.. ఎంతలా అంటే.. నిజమైన పోలీసుల కంటే.. ఇతనే నిక్కచ్చైన పోలీసుగా అక్కడ ప్రజలను నమ్మించేశాడు..

Andhra Pradesh: వీడు మామూలోడు కాదు.. ఒంటిపై ఖాకీ డ్రెస్.. చేతిలో వాకీటాకీ.. కట్ చేస్తే..
Crime News
Follow us on

పోలీస్ డ్రెస్ లేకుండా జనాలను బెదిరిస్తూ.. నకిలీ పోలీస్‌గా చలామణి అయ్యేవాళ్ళని చాలా సార్లు చూసుంటాం.. కానీ వీడు అంతకుమించి యవ్వారం మొదలెట్టాడు.. ఏకంగా వాకీటాకీలను వాడుతూ జనాలను నమ్మిస్తూ అసలైన పోలీస్‌గా చలామణి అయ్యాడు.. ఎంతలా అంటే.. నిజమైన పోలీసుల కంటే.. ఇతనే నిక్కచ్చైన పోలీసుగా అక్కడ ప్రజలను నమ్మించేశాడు.. కట్ చేస్తే.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఇలా ఓ నకిలీ పోలీస్ గుట్టురట్టవ్వడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఒంటిపై కాకి డ్రెస్.. నడుముకు తోలు బెల్టు.. నెత్తిన టోపీ.. చేతిలో వాకీటాకీ అసలు పోలీసులకు ఏమాత్రం తీసుకొని విధంగా నకిలీ పోలీసు అవతారమెత్తిన ఓ వ్యక్తిని ఏపీలోని రాజంపేట పట్టణ పోలీసుల అరెస్టు చేసి కటకటాల వెనుకకు పంపించారు.

రాజంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసుగా చెలామణి అవుతున్న వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసినట్లు రాజంపేట అర్బన్ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన శివయ్య అనే వ్యక్తి పోలీసు యూనిఫామ్ ధరించి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. అచ్చం పోలీసుగా నకిలీ ఐడీ కార్డులను సృష్టించి.. డ్రెస్ వేసి, వాకీటాకీలను ఉపయోగిస్తూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న శివయ్యను రాజంపేట పట్టణంలోని విద్యానగర్ కాలనీ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు ఆచారి తెలిపారు.

పట్టుబడిన నిందితుడి వద్ద నుంచి మూడు నకిలీ పోలీస్ ఐ.డి కార్డులను, ఒక వాకి టాకీని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మద్దయ్య ఆచారి వివరించారు. కాగా.. ఈ నకిలీ పోలీసు వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..