
చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు అన్న తేడా లేకుండా కొరికే కుక్కల దాడి ఇప్పటి వరకు చూశాం. కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో తన కుక్క జోలికి వచ్చిన ఎదురింటి వ్యక్తిని ఎక్కడపడితే అక్కడ కొరికాడు… కాదు కాదు…. అక్కడే పిచ్చి కుక్క కొరికినట్లు కొరికాడు… ఒక మనిషిని…. మరో మనిషి.. ఆయువు పట్టు వద్ద కొరకడం చర్చనీయాంశమైంది. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం వంకర కుంట గ్రామానికి చెందిన పోతుల కుళ్లాయప్ప కుక్కను పెంచుకుంటున్నాడు… అయితే ఎదురింట్లో ఉంటున్న గోపాల్ అనే వ్యక్తి… మీ పెంపుడు కుక్క మా ఇంట్లోకి వచ్చి చెప్పులు కొరుకుతుందని… చిన్నపిల్లలను కరుస్తుందని కుక్క యజమాని కుళ్లాయప్పను ప్రశ్నించాడు.. అంతే ఎక్కడ లేని కోపం కట్టలు తెంచుకుంది కుక్క యజమాని కుళ్ళాయప్పకు. నా కుక్కనే అంటావా??? అని ఎదురింటి వ్యక్తి గోపాల్‌తో గొడవకు దిగాడు కుళ్ళాయప్ప. ఎక్కడైనా యజమానిపై ఎవరైనా దాడి చేస్తే… పెంపుడు కుక్క దాడి చేసిన వారి పిక్కలు పట్టుకుని కొరికేస్తుంది. కానీ ఇక్కడ తన పెంపుడు కుక్క గురించి మాట్లాడారని…. కుక్క యజమాని కుళ్లాయప్ప.. ఎదురింటి గోపాల్‌పై దాడి చేశాడు.. అక్కడెక్కడో కాదు… డైరెక్ట్‌గా అక్కడే ( మర్మాంగ వృషణాలు) కుక్క పీకినట్టు నోటితో కొరికాడు కుళ్ళాయప్ప.
విచిత్రం ఏంటంటే.. కుళ్లాయప్ప ఎదురింటి గోపాల్ మర్మాంగం కొరికేటప్పుడు.. కుళ్లాయప్ప తండ్రి పోతులయ్య.. గోపాల్ ఎటూ కదలకుండా కాళ్లు పట్టుకున్నాడట. ఈ దాడిలో గోపాల్ మర్మాంగం, వృషణాలు చర్మం ఊడేపోయింది. దీంతో వెంటనే గోపాల్‌ను కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు… అనంతపురం ఆస్పత్రిలో ప్రాథమిక చేసిన తర్వాత… గోపాల్ పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు మెరుగైన వైద్యం కోసం తరలించారు. బాధితుడు గోపాల్ కుమారుడు నల్లమడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో… ప్రస్తుతం కుక్క యజమాని కుళ్లాయప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. విడ్డూరం కాకపోతే… ఎక్కడా దొరకనట్లు…. అక్కడ కొరకటం ఏంటి అనుకుంటున్నారు ఈవిషయం తెలిసినవాళ్లు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..