చటుక్కున కొడతాడు.. లటుక్కున లాగేస్తాడు.. రైలులో ఆ రూట్‌లో ప్రయాణిస్తున్నారా.. బీకేర్‌ఫుల్..

| Edited By: Shaik Madar Saheb

Jul 31, 2024 | 2:00 PM

గుంటూరు - సికింద్రబాద్ మధ్య ప్రతి రోజూ అనేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుంటాయి.. నల్గొండ మీదుగా ప్రయాణించే ట్రెయిన్స్ లో గత కొంతకాలంగా సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇవి సాధారణంగా జరిగే దొంగతనాలు కాదు. ఎవరైతే ఫుట్ బోర్డ్ (డోర్ వద్ద) ప్రయాణం చేస్తూ ఫోన్లు చూస్తుంటారో వారినే టార్గెట్ చేసి చోరీ చేస్తున్నారు.

చటుక్కున కొడతాడు.. లటుక్కున లాగేస్తాడు.. రైలులో ఆ రూట్‌లో ప్రయాణిస్తున్నారా.. బీకేర్‌ఫుల్..
Train
Follow us on

గుంటూరు – సికింద్రబాద్ మధ్య ప్రతి రోజూ అనేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుంటాయి.. నల్గొండ మీదుగా ప్రయాణించే ట్రెయిన్స్ లో గత కొంతకాలంగా సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇవి సాధారణంగా జరిగే దొంగతనాలు కాదు. ఎవరైతే ఫుట్ బోర్డ్ (డోర్ వద్ద) ప్రయాణం చేస్తూ ఫోన్లు చూస్తుంటారో వారినే టార్గెట్ చేసి చోరీ చేస్తున్నారు. ఈ తరహా దొంగతనాలపై ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. కదులుతున్న రైలులో ఫుట్ బోర్డు వద్ద ఫోన్ చూస్తూ, లేదా మాట్లాడుతూ కనిపించారో ఇక అంతే సంగతులు.. అకస్మాత్తుగా కర్రతో ఒక దెబ్బ మీ మీద పడుతుంది. మీ చేతిలోని సెల్ ఫోన్ కింద పడిపోతుంది. కళ్లు మూసి తెరిచేలోపు దాన్ని అందుకున్న వ్యక్తి అక్కడ నుంచి పరారవుతాడు. ఈ తరహా దొంగతనాలు వరుసన జరుగుతుండటంతో రైలు ప్రయాణీకుల్లో భయాందోళనలను వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి తరహాలో తమ ఫొన్లు పోగొట్టుకున్న వ్యక్తులు పోలీసులుకు అనేక ఫిర్యాదులు చేశారు.. ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ అవ్వడంతో రైల్వే పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రద్దీ లేని రైల్వే స్టేషన్స్ లోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు గుర్తించారు. స్థానిక వ్యక్తులే ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు అంచనాకు వచ్చిన పిడుగురాళ్ల పోలీసులు స్టేషన్స్ లో నిఘా పెట్టారు. సీసీ కెమెరా విజువల్స్ సాయంతో పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెంకు చెందిన మణికంఠ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. అతనే ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించాలన్న కోరికతో రద్దీగా ఉన్న రైలులోని మెట్ల మీద కూర్చుని ప్రయాణిస్తున్న వారిని టార్గెట్ చేసి సెల్ ఫోన్లు అపహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి అతని వద్ద నుండి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మణికంఠను అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..