AP Rains: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఒకవైపు వర్షాలు, మరోవైపు చలిగాలులు.. అప్రమత్తత అవసరం..

|

Nov 22, 2022 | 4:13 PM

దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరానికి దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది..

AP Rains: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఒకవైపు వర్షాలు, మరోవైపు చలిగాలులు.. అప్రమత్తత అవసరం..
AP Weather Report
Follow us on

నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడింది. దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరానికి దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది. ఇది నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. మత్స్యకారులు రెండు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.

రాబోయే మూడు రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:– నవంబర్ 22, 23, 24 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈ రోజు:-

  • తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.
  • భారీ వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో కురిసే అవకాశముంది.
  • మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:-

ఈ రోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మరోవైపు రాష్ట్రమంతా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ అధికారులు తెలిపారు. అలాగే అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో గంటకు 15 కి.మీ వేగంతో చల్లటి గాలులు వీస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని.. జనాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.