AP Weather: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు

|

Aug 10, 2024 | 3:08 PM

ఏపీలో గతవారం వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. వరుణుడు స్మాల్ గ్యాప్ ఇచ్చాడు. అయితే ఈ రెండు, మూడు రోజుల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

AP Weather: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
Andhra Weather Report
Follow us on

ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు ఉన్నది. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

శనివారం, ఆదివారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

సోమవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

————————————–

శనివారం, ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ :-

—————-

శనివారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..