
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిస్సాకు అనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్ప పీడనం మరింత బలపడే అవకాశముంది. నైరుతి రుతుపవనాలు పురోగమనానికి అనుకూల అవకాశాలున్నాయి. మరో మూడు రోజుల్లో ఏపీ అంతటా నైరుతి విస్తరిస్తుందని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ముడు రోజుల పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. 24గంటల్లో పార్వతి పురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు అధికారులు. కోస్తాలో అయిదురోజులు చాలా చోట్ల తేలిక నుంచి మోస్తారు వర్షాలు.. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు.. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయి.
మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళద్దని సూచిస్తున్నారు. గడచిన 24 గంటల్లో విజయనగర లో 34మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయింది. కావలి వరకు ఋతుపవనాలు విస్తరించాయి.. మరింత ముందుకు విస్తరించెందుకు అనుకూల అవకాశాలున్నాయి. రెండు మూడు రోజుల్లో ఏపీ అంతా రుతుపవనాలు విస్తరిస్తాయి. రూతుపవనాలు ఇంకా విస్తరించని ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండ, ప్రీ మాన్సున్ వర్షాలు కురుస్తున్నాయి.. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాధ కుమార్.