Lockdown Rules: లాక్‌డౌన్‌‌ ఎఫెక్ట్.. ఏపీ వాహనదారులకు అలెర్ట్.. అక్కడ కూడా నో ఎంట్రీ..!

Lockdown Rules: ఏపీ వాహనదారులకు ముఖ్య అలెర్ట్. ఏపీ నుంచి వచ్చేవారికి తెలంగాణలోకే కాదు కర్ణాటకలోకి ఎంట్రీ ఇవ్వడం లేదు...

Lockdown Rules: లాక్‌డౌన్‌‌ ఎఫెక్ట్.. ఏపీ వాహనదారులకు అలెర్ట్.. అక్కడ కూడా నో ఎంట్రీ..!
lockdown

Updated on: May 24, 2021 | 8:11 AM

Lockdown Rules: ఏపీ వాహనదారులకు ముఖ్య అలెర్ట్. ఏపీ నుంచి వచ్చేవారికి తెలంగాణలోకే కాదు కర్ణాటకలోకి ఎంట్రీ ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లే వాహనాలను కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు ఆపేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు తమ రాష్ట్రంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో బోర్డర్‌ చెక్‌పోస్టుల వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

కర్ణాటకలో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌‌ను ప్రభుత్వం విధించింది. కరోనా కేసులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుండటంతో మరికొద్ది రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు నో ఎంట్రీ అంటున్నారు. కర్నూలు ఆలూరు నియోజకవర్గ పరిధిలోని కర్ణాటక-ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఆలూరు నుంచి కర్ణాటకలోని బళ్లారి తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను సిందవాల్ చెక్‌పోస్టు వద్ద కర్ణాటక పోలీసులు నిలిపివేస్తున్నారు. అత్యవసర వాహనాలను సైతం అనుమతించడం లేదు. దీంతో కర్ణాటక సరిహద్దు ప్రాంతంల్లో ఉన్న ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కర్ణాటక నుంచి ఆలూరు మీదుగా కర్నూలుకు వచ్చే వాహనాలకు మాత్రం ఏపీ పోలీసులు మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి ఇస్తున్నారు. అత్యవసర వాహనాలకు అన్ని సమయాల్లో ఎంట్రీ ఇస్తున్నారు.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!