Lithuania woman: కామాంధులకు కన్నుమిన్ను కానరావడం లేదు.. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు.. కీచకులుగా మారి వారి వక్రబుద్ధిని బయటపెడుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసు కలకలం రేపింది. ఏపీలోని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చిన లితుయేనియా దేశానికి చెందిన విదేశీ మహిళపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు కామాంధులు. ఏపీలోని అందమైన ప్రదేశాలను చుట్టేయ్యాలన్న ఆమె కోరికను తమకు అనుకూలంగా మార్చుకొని స్నేహితుడితో కలిసి ప్లాన్ చేశాడు సాయి కుమార్. గోవా వెళ్తున్న విదేశీ మహిళను కృష్ణపట్నం సందర్శించాలంటూ కోరాడు. సరిగ్గా అనుకున్న ప్లాన్ విదేశీ మహిళతో కలిసి గూడూరుకు చేరుకున్నాడు సాయికుమార్. స్నేహితుడితో కలిసి సైదాపురం అడవిలో విదేశీ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. వారి వక్రబుద్ధిని పసిగట్టిన ఆమె.. వారి నుంచి తప్పించుకుంది. స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. విదేశీ మహిళ దగ్గర ఉన్న సాయికుమార్ ఆధార్, పాన్ కార్డును గుర్తించిన పోలీసులు నిందితులు మనుబోలుకు చెందిన సాయి, గూడూరు చెందిన అబీద్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో నెల్లూరు జిల్లా పోలీసులకు ధన్యవాదులు తెలిపింది విదేశీ మహిళ. తనపై అత్యాచారానికి యత్నించిన నింధితులను.. ఘటన జరిగిన 6 గంటల్లోనే అరెస్ట్ చేయడంపై పోలీసులను అభినందించింది. పోలీస్ స్టేషన్ లో తనను బాగా చూసుకున్నారని తెలిపింది.
ఒంటిరిగానే విదేశాలు తిరుగుతానని.. అలాగే ఇండియాకు వచ్చానని చెప్పింది. ఇలా జరుగుతుందని ఊహించలేదని.. తనకు ఇండియా అంటే చాలా ఇష్టమని చెప్పింది విదేశీ మహిళ. ఈ సందర్భంగా ఆమె నెల్లూరు జిల్లా పోలీసులకు ధ్యాంక్స్ చెప్పింది. ఘటన జరిగిన 6గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయడంపై ఆనందం వ్యక్తం చేసింది.
Also Read: