ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం….
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
సోమ, మంగళ, బుధ :- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది .
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
సోమవారం- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మంగళవారం, బుధవారం :- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది
రాయలసీమ :-
సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
బుధవారం:- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి