అక్టోబర్ నెలలో అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లు, పాఠశాలలకు సెలవులే సెలవులు ఉండనున్నాయి. ఈ సంవత్సరంలో అత్యధికంగా ఈ నెలలోనే ఎక్కువ పండుగులు వచ్చాయి. దసరా, దీపావళి పండుగలు ఒకే నెలలో రావడంతో విద్యార్ధులకు భారీగా సెలవులు లభించాయి. ఈ రెండు పండుగుల దృష్ట్యా అక్టోబర్ నెలలో ఏకంగా స్కూల్స్ 16 రోజుల పాటు మూతపడనున్నాయి. అక్టోబర్ 3 నుంచి 14 వరకు ఏపీలో దసరా సెలవులు ప్రకటించగా.. అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఏకంగా 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ సర్కార్.
ఏపీ అటుంచితే.. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు కూడా దసరా పండుగ ముందు ప్రారంభం కానున్నాయి. ఈ సంబరాలు మొత్తం 9 రోజులు ఉంటాయి. ఎంగిలి బతుకమ్మ పండుగ అక్టోబర్ 2న ఉండనుంది. ఆరోజు ఎలాగో గాంధీ జయంతి కాబట్టి.. పాఠశాలలకు అఫీషియల్ హాలిడే. అక్టోబర్ 31న దీపావళి పండుగ సందర్భంగా.. స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 20, 27 తేదీల్లో ఆదివారాలు కూడా కలిపి ఏకంగా ఈ నెల దాదాపుగా 16 రోజులు విద్యార్ధులకు సెలవులు ఉంటాయి. అంటే.. అక్టోబర్‌లో స్కూల్స్ పని చేసేది కేవలం 14 రోజులు మాత్రమే. ఇలా చూసుకుంటే విద్యార్ధులకు పండుగ అనే చెప్పాలి.
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్ 3 – 14 వరకు – దసరా సెలవులు
అక్టోబర్ 20 – ఆదివారం
అక్టోబర్ 27 – ఆదివారం
అక్టోబర్ 31 – దీపావళి
ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..