AP Weather Report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ / వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. 28 జూలై 2021 న ఉత్తర బంగాళాఖాతం & పరిసరాల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. దీని ఫలితంగా రాగల మూడు రోజులలో వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
1. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా, ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
2. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
3. రాయలసీమ: ఈ రోజు రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశంఉందని అమరావతి వాతావరణ సంచాలకులు తెలిపారు.