Andhra Pradesh: ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ కమిషనర్..

|

Mar 09, 2022 | 7:19 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యాశాఖ అలర్ట్ చేసింది. పరీక్ష నేపథ్యంలో సెలవులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు

Andhra Pradesh: ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ కమిషనర్..
School Educations
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యాశాఖ అలర్ట్ చేసింది. పరీక్ష నేపథ్యంలో సెలవులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం.. పదో తరగతికి పాఠాలు చెప్పే టీచర్లకు పరీక్షలు పూర్తయ్యే వరకు సెలవులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. అసాధారణ పరిస్థితుల్లో తప్ప,సెలవులు మంజూరు చేయొద్దని జిల్లా విద్యాధికారులకు సూచించారు. ఉపాధ్యాయులు లేకుండా ఏ తరగతి ఉండకూడదని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంపై మార్గదర్శకాలు విడుదల చేశారు. మొదటిసారిగా పదిలో ఏడు పేపర్ల విధానం ప్రవేశపెట్టామని, పాఠ్య ప్రణాళికపై విద్యార్థులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులందరూ ప్రతిరోజూ హాజరయ్యేలా చూడాలని, అన్ని సబ్జెక్టులను కవర్ చేసేలా రోజువారీ ప్రణాళిక చేసుకోవాలని ఆదేశించారు. యూట్యూబ్ ఛానల్స్, దీక్ష పోర్టల్లో ఉండే మెటీరియల్‌ను ఉపయోగించి రివిజన్ చేయాలని సూచించారు.

Also read:

Viral Photo : నెట్టింట్లో రచ్చ చేస్తోన్న ఫోటో.. జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు.. ఇదేంటో మీరేమైనా కనిపెట్టగలరా?..

Andhra Pradesh: అటు ఆమెతో.. ఇటు ఈమెతో వ్యవహారం నడిపాడు.. చివరకు అడ్డంగా బుక్కయిన పోలీసు..

Viral Video: రామ చిలుక స్నానం చేయడం ఎప్పుడైనా చూశారా?.. ఎంత చూడముచ్చటగా ఉన్నాయో..!