Lagadapati Rajagopal: మళ్లీ కాంగ్రెస్‌లో యాక్టివ్ అవుతారా? పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన లగడపాటి..
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ సన్నాహాలను ప్రారంభించింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, అక్కడి నాయకులు వరుసగా భేటీ అవుతుండటం.. పలు కామెంట్స్ చేస్తుండటం.. లాంటి పరిణామాలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కాంగ్రెస్ మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ సన్నాహాలను ప్రారంభించింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, అక్కడి నాయకులు వరుసగా భేటీ అవుతుండటం.. పలు కామెంట్స్ చేస్తుండటం.. లాంటి పరిణామాలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కాంగ్రెస్ మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. భేటీ అనంతరం లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి మీటింగ్ తర్వాత మాట్లాడిన లగడపాటి రాజగోపాల్.. తనకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. రాజకీయాల్లో నుంచి తప్పుకున్నప్పటికీ.. ఉండవల్లికి మద్దతిస్తానని తెలిపారు. వారి తరపున ప్రచారం చేస్తానని అన్నారు. కాకినాడలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందని.. వెళ్తూ వెళ్తూ దారిలో మర్యాదపూర్వకంగా హర్షకుమార్ ను కలిశానన్నారు. ప్రజల కోసం వారి అవసరాల కోసం భవిష్యత్తును లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టానన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు తాము పూర్తిగా విభేదించామన్నారు.
రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని.. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా ఉండవల్లికి హర్ష కుమార్ కి మద్దతు ఇస్తానని లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసిన వారి తరఫున ప్రచారం చేస్తానన్నారు. గతంలో జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేదని.. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉందన్నారు. తనకు రాజకీయంగా పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ.. అని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం నాకు చాలా సంతోషకరమంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ, ఆ పార్టీ అంటే తనకు ఎప్పుడూ గౌరవమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు. హర్షకుమార్, ఉండవల్లి రాజకీయాల్లో కొనసాగాలని లగడపాటి కోరారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..