AP Crime News: కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్.. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం..

| Edited By: Ravi Kiran

Aug 19, 2021 | 9:28 AM

AP Crime News: కర్నూల్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వారి కన్ను పడిందంటే చాలు ఆ ఇల్లు లూటీ కావాల్సిందే. పగలంతా రెక్కీ నిర్వహించి రాత్రిపూట పని కానిచ్చేస్తున్నారు.

AP Crime News: కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్..  కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం..
Crime
Follow us on

AP Crime News: కర్నూల్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వారి కన్ను పడిందంటే చాలు ఆ ఇల్లు లూటీ కావాల్సిందే. పగలంతా రెక్కీ నిర్వహించి రాత్రిపూట పని కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులను, నగలను దోచుకెళుతున్నారు. పోలీసులకు చిక్కకుండా మాయ చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన మాచర్ల శ్రీకాంత్, బోయ రమేష్‌లు నగరంలోని బాలాజీ నగర్‌లో ఓ ఇంట్లో ఈనెల రెండో తేదీన చోరీకి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. అంతేకాదు కోడుమూరులో వీరు చోరీలకు పాల్పడ్డారని వీరిపై రౌడీషీట్ కుడా నమోదైందని డీఎస్పీ మహేశ్ వివరించారు. వీరి దగ్గరి నుంచి ఒక కోటి నాలుగు లక్షల రుపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దొంగలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మహేశ్ మాట్లాడుతూ.. నగర ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాలనీలలోకి కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా ఎవరైనా ఇళ్లకు తాళాలు వేసి తీర్థయాత్రలకు కానీ టూర్‌లకు కానీ వెళ్లేవాళ్లు పోలీసులకు సమాచారం అందిస్తే మంచిదని పేర్కొన్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే చోరీలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని వివరించారు.

High Court judges: హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

Hyderabad: పోలీసులకు పాలాభిషేకం.. సత్వర న్యాయం చేసినందుకు రుణం తీర్చుకున్న బాధితుడు

Schemes for Farmers: రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఐదు ముఖ్య పథకాలు.. పూర్తి వివరాలు మీకోసం..