AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato: టమాటా ధరలకు రెక్కలు.. కిలో 50 రూపాయలు.. దిగుబడి తగ్గడమే కారణం..

రైతుల పరిస్థితి ఎప్పుడెలాగుంటుందో వాళ్లకే తెలియడం లేదు. రైతు కష్టాన్ని పక్కనబెడితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కక అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు...

Tomato: టమాటా ధరలకు రెక్కలు.. కిలో 50 రూపాయలు.. దిగుబడి తగ్గడమే కారణం..
Tamota
Srinivas Chekkilla
|

Updated on: Oct 11, 2021 | 7:42 PM

Share

రైతుల పరిస్థితి ఎప్పుడెలాగుంటుందో వాళ్లకే తెలియడం లేదు. రైతు కష్టాన్ని పక్కనబెడితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కక అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. కూరగాయలు పండించే రైతుల పరిస్థితి అయితే మరి దారుణంగా మారింది. మొన్నటివరకు టమాటా రైతులది ఇదే పరిస్థితి. టమాటా ధరలు పాతాళానికి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

మొన్నటివరకు టమోటా రైతులు గిట్టుబాటు ధర లేక టమాటాను రోడ్లపై పారబోశారు. మరికొందరు పంటను పశువులకు వదిలేశారు. రైతులు టమాటా పంట తీసివేయటంతో వెంటనే టమాటా ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మొన్నటివరకు చాలా కిలో రూ.10 పలికిన టమాటా ఇప్పుడు ఏకంగా రూ 50 పలుకుతోంది. ఒక్కసారిగా పెరిగిన ధరలతో టమాటా రైతులే ఆశ్చర్యపోతున్నారు. తమకు మంచి రోజులు వచ్చాయంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‎లోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌కు పెద్దఎత్తున టమాటా తరలివస్తోంది. టమాటా ఎక్కువగా పండే తుగ్గలి, మద్దిగెర, జొన్నగిరి ప్రాంతాల నుంచి పత్తికొండ మార్కెట్‌కు చేరుతోంది. ఒకవైపు డిమాండ్… మరోవైపు ఎగుమతులు పెరగడంతో టమాటా సప్లై చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. టమాటాకు మంచి ధర పలుకుతోన్నా ఆ స్థాయిలో పంట దిగుమతి లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో టమాటా పంటలు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. ధర ఉన్నప్పుడేమో దిగుబడి ఉండదు. మంచి దిగుబడి ఉంటే ధర ఉండదు. ఇలా, ఎలా చూసినా నష్టపోయేది మాత్రం రైతన్నే అవుతున్నాడు.

అయితే టమాటా ధర పెరగడంతో సామాన్యుడిపై భారం పడనుంది. ఇప్పిటికే పెట్రోల్, డిజీల్, వంట నూనె ప్రజల నడ్డివిరుస్తోంది. తాజాగా టమాటా ధర పెరగటంతో కొందరు టమాటా వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఉల్లి రేటు కూడా పెరగటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Read Also.. CM YS Jagan in Tirumala: తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా