
Kurnool milk in kgs: పెరుగు, నెయ్యి వంటి వాటిని కిలోల లెక్కన అమ్మడం చూశాం. కానీ పాలు కిలోల లెక్కన అమ్మడం ఎప్పుడైనా చూశారా..?. లేదు కదా.. పదండి.. అలాంటి చిత్రమెక్కడో చూద్దాం పదండి. కర్నూలు జిల్లాలోని రుద్రవరం మండలం డి.కొట్టాలలో కిలోల పద్దతిలో పాలను విక్రయిస్తున్నారు. స్వచ్చమైన పాలను కేజీ రూ. 33 కే సేల్ చేస్తున్నారు. అది కూడా అప్పటికప్పుడు పితికి ఫ్రెష్‌గా ఇచ్చేస్తున్నారు. స్వచ్చమైన పాలు అందునా సరసమైన ధరలకు వస్తుండటంతో నంద్యాల నుంచి వచ్చి పాలను కిలోల్లో కొనుగోలు చేస్తున్నారన్నారట జనాలు.
కొట్టాలలో పాల డెయిరీ లేకపోవడంతో పాలను కిలోల్లో పాలను విక్రయించాల్సి వస్తుందని పాడిరైతులు చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులకు అనేక అర్జీలు పెట్టుకున్న స్పందన రావడం లేదని వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు కిలోల పాలు విక్రయిస్తున్నట్లు పాడి రైతులు చెబుతున్నారు. రెండు కిలోల పాలు రూ.66 మాత్రమే వస్తోందని.. ఒక బర్రెకు దాణా, మేత ఖర్చులు మాత్రం వేలల్లో అవుతున్నాయని వివరించారు. ఇలా అయితే పశువులను అమ్ముకోవడం తప్ప మరో దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?