Andhra Pradesh: రూ.45 లక్షల మద్యం బాటిళ్ల ధ్వంసం.. రోడ్డు రోలర్‌ ఎక్కించి మరీ..

|

Jul 24, 2022 | 4:35 PM

Kurnool: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్‌ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యం సరఫరా అవుతోంది. ముఖ్యంగా కర్ణాటక మద్యాన్ని అక్రమదారులు కొత్త కొత్త మార్గాల్లో

Andhra Pradesh: రూ.45 లక్షల మద్యం బాటిళ్ల ధ్వంసం.. రోడ్డు రోలర్‌ ఎక్కించి మరీ..
Liquor Destroy
Follow us on

Kurnool: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్‌ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యం సరఫరా అవుతోంది. ముఖ్యంగా కర్ణాటక మద్యాన్ని అక్రమదారులు కొత్త కొత్త మార్గాల్లో రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌ శాఖ పోలీసులు రోడ్డు రోలర్లు, జేసీబీలతో ధ్వంసం చేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో కూడా షేర్‌ చేస్తూ అక్రమ మద్యం సరఫరాపై గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా రాయలసీమ ముఖద్వారామైన కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న ఆలూరు –మొలగవల్లి గ్రామల మధ్య పట్టుబడ్డ అక్రమ మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించేశారు. గతేడాది నుంచి ఈ మార్గంలో స్వాధీనం చేసుకున్న దాదాపు 35 నుంచి 40 లక్షల రూపాయల మద్యం బాటిళ్లను ప్రొహిబిషన్‌, స్థానిక SEB పోలీసులు రోడ్డు రోలర్‌ సహాయంతో ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటుసారా తయారు చేయడం, విక్రయించడం నేరమని అటువంటి వారికి కఠిన శిక్షలు తప్పవన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ పోలీసులు అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నారు. చెక్​పోస్టులు, ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..