Infant Kidnap : వీడిన ఆదోని పసికందు కిడ్నాప్ కేసు.. పుట్టీ పుట్టగానే శిశువును ఎత్తుకు పోయిన ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్

|

Jun 05, 2021 | 10:37 PM

కర్నూలు జిల్లా ఆదోనిలో పసికందు కిడ్నాప్ మిస్టరీ వీడింది

Infant Kidnap : వీడిన ఆదోని పసికందు కిడ్నాప్ కేసు.. పుట్టీ పుట్టగానే  శిశువును ఎత్తుకు పోయిన ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్
Adoni Infant Kidnap Gang Ar
Follow us on

Adoni Baby Kidnap case : కర్నూలు జిల్లా ఆదోనిలో పసికందు కిడ్నాప్ మిస్టరీ వీడింది. ఈ కేసును సవాల్ గా తీసుకొని పసికందు కిడ్నాప్‌కు పాల్పడిన వారిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. శిశువు కిడ్నాప్ జరిగిన వెంటనే హాస్పిటల్ కు వెళ్ళి ఆదోని డిఎస్పీ, పోలీసు సిబ్బంది అక్కడి సిసి టివిలను పరిశీలించారని… ఆదోని సబ్ డివిజన్ పోలీసులను 9 టీం లుగా ఏర్పాటు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ఆదోని ఆర్ట్స్ కళాశాల జూబ్లి హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఆడశిశువు కిడ్నాప్ కు పాల్పడిన  ఇద్దరు మహిళలు సహా మొత్తం ముగ్గురుని పట్టుకొని అరెస్టు చేసి రిమాండుకు తరిలించామని ఎస్పీ తెలిపారు. ఈ కేసును చేధించిన పోలీసులకు నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశామన్నారు. పుట్టిన బిడ్డకు మరల పునర్జన్మ దొరికిందన్న ఎస్పీ.. కొద్దిగా ఆలస్యం అయి ఉంటే ఏలాంటి పరిస్ధితులు ఎదుర్కోవలసి వస్తుందో తెలిసేది కాదన్నారు.

డిజిపి వారి ఆదేశాలతో మహిళ సంరక్షణకు దిశా చట్టం, దిశా పోలీసుస్టేషన్లు, దిశా పోలీసులు, దిశా యాప్ గురించి విస్తృతంగా అవగాహన చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. రక్షించబడిన ఆడ పసికందుకు ఆ పాప తల్లిదండ్రుల అంగీకారంతో “దిశా “ అనే పేరుతో నామకరణం చేస్తున్నామన్నారు. కాగా, ఆదోనిలో సినీఫక్కీలో బాలిక కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. బిడ్డకు జన్మనిచ్చి ఒక్కరోజు కాకముందే పసికందుకు సూది మందు అంటూ ఆమె తల్లికి మాయమాటలు చెప్పి బురఖా ధరించిన మహిళ పాపను ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే.

Read also : YSRCP MP : ‘తండ్రీకొడుకులిద్దరూ పక్క రాష్ట్రంలో ఉండటం వల్లే ఏపీలో ఈసారి ముందే వర్షాలు’.. విజయసాయి ఎద్దేవా పరంపర