Andhra Pradesh: గురుకుల కళాశాలలో విషజ్వరాలు కలకలం.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

ఓ పక్క వేసవిలో ఉక్కబోత మొదలైంది. ఎండ వేడి రోజు రోజుకీ పెరిగిపోతుంది.. మరోవైపు స్టూడెంట్స్ కు పరీక్షల సీజన్ మొదలైంది. దీంతో విద్యార్ధులు చదువుపై దృష్టి సారిస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాలో గురుకలా కళాశాలలో విషజ్వరాలు కలకలం రేపుతున్నాయి. రేకుల షెడ్డు కావడంతో ఆ వేడికి అందరూ అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినిలు తెలిపారు.

Andhra Pradesh: గురుకుల కళాశాలలో విషజ్వరాలు కలకలం.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Students Hospitalized

Edited By: Surya Kala

Updated on: Mar 12, 2025 | 9:04 PM

ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గురుకుల బనవాసి గురుకుల కళాశాలలో విషజ్వరాలు కలకలం రేపుతున్నాయి. కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు సుమారు 12 మందికి పైగా ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయారు. వారిని హుటాహుటిగా ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో మరో 20 మందికి పైగా విద్యార్థులు కూడా అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఈ బాధితులకు కళాశాలలోనే చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇంటర్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల కోసం స్టూడెంట్స్ రాత్రి సమయం ఎక్కువ సేపు చదువుకుంటున్నారు. మరోపక్క కళాశాలలో రేకుల షెడ్డు కావడంతో ఆ వేడికి అందరూ అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినిలు తెలిపారు.

అయితే విషయం తెలుసుకున్న ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల జ్వరాలపై విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..