Mudragada : క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు సమాజానికి సేవ చేసిన వారే.. అలా అవమానించొద్దు : సీఎంకు ముద్రగడ లేఖ

తూర్పుగోదావరి జిల్లా కీలక నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఉభయ రాష్ట్రాల క్షత్రియ..

Mudragada : క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు సమాజానికి సేవ చేసిన వారే..  అలా అవమానించొద్దు : సీఎంకు ముద్రగడ లేఖ
Mudragada Letter To Cm

Updated on: Jun 22, 2021 | 1:10 PM

Mudragada Padmanabham letter to CM Jagan : తూర్పుగోదావరి జిల్లా కాపు సామాజిక వర్గ కీలక నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఉభయ రాష్ట్రాల క్షత్రియ సమాజం వారు తమకు చేసుకున్న విన్నపమును పరిశీలించమని ముద్రగడ తన లేఖలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. “రాజ్యాలు పోయినా మహారాజుల కుటుంబమని అందరూ గౌరవిస్తారు. ఈ మధ్య మాన్సాస్ ట్రస్ట్ విషయంలో గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఛార్జ్ తీసుకున్న తరువాత ఎంపీ విజయసాయిరెడ్డి.. అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామనడం చాలా బాధాకరం.

నేటికీ మా ప్రాంతంలో క్షత్రియులను, వెలమదొరలను పేరుతో సంబోధించిము, దివాణం లేదా దొరలని సంబోధిస్తారు. క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు ఎన్నో భూములిచ్చి ఈ సమాజానికి సేవ చేసిన వారే..  పూర్వం గౌరవంగా జీవించిన వారిని అగౌరవపరిచే వద్దని మీ నాయకులకు ఆదేశాలు జారీ చేయండి.” అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.. ముద్రగడ లేఖ పూర్తి పాఠం.. ఈ దిగువున చూడొచ్చు.

Mudragada Letter to CM

Read also : Vijayasai reddy vs Ashok Gajapathi raju : ‘ఈ 40 ఏళ్లలో మీ హిందూత్వ ఎటు పోయింది అశోక్?’ : విజయసాయిరెడ్డి