జగన్ టీమ్ 2.0లో(Jagan Team 2.0) అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కుల, సామాజిక అంశాలతో పాటు సీనియారిటీ అంశాల ఆధారంగానే మంత్రి వర్గ కూర్పు జరిగింది. టీమ్ 24లో బీసీలకు అధిక ప్రాధాన్యం దక్కింది. బీసీలు గతంలో ఏడుగురు ఉంటే.. ఈ సారి అత్యధికంగా 10 మందికి అవకాశం దక్కింది. గత కేబినెట్‌లో రెడ్డి సామాజికవర్గానికి 04 పదవులు ఉంటే ఈ సారి కూడా 4 బెర్తులే ఇచ్చారు. కాపులు గత కేబినెట్‌లో నలుగురు ఉంటే.. ఇప్పుడు కూడా నలుగురినే ఎంచుకున్నారు. పదిహేనేళ్ల గ్యాప్ తర్వాత 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపు అందుకున్నారు కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana). ఆయనకు ఇప్పుడు మంత్రి పదవి దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కొట్టు సత్యనారాయణ.
2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 1994,1999 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికలలో కూడా ఆయనకు అదృష్టం కలిసిరాలేదు. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనను విజయం వరించింది.
కాపు సామాజిక వర్గానికి చెందిన కొట్టుకు సీనియర్ నేతగా గుర్తింపు ఉంది. 1955లో తాడేపల్లిగూడెంలో జన్మించిన కొట్టు సత్యనారాయణ సమీపంలోని పెంటపాడు డీఆర్‌జీ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ రూ.600 కోట్లతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు
ఇవి కూడా చదవండి: Gudivada Amarnath: కార్పోరేటర్ నుంచి మంత్రి వరకు.. విశాఖ ఫైర్ బ్రాండ్ లీడర్‌కు జగన్ కేబినెట్‌లో చోటు..
TRS: “ఛలో ఢిల్లీ..” టీఆర్‌ఎస్ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..