Andhra Pradesh: శభాష్ ఇంజనీర్ సాబ్.. పూర్వీకుల ఆహార పద్ధతిని వినియోగంలోకి తీసుకువస్తున్న యువకుడు..

|

Aug 12, 2023 | 1:57 PM

ఆఖరికి చిన్న పిల్లలు సైతం ఆకస్మిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. జిమ్ చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వారు మరికొందరు.. ఆన్నం తింటూ కొందరు.. ఆడుకుంటూ కొందరు.. ఇలా చిన్న చిన్న కారణాలతోనే.. ఉన్న చోటనే కుప్పకూలిపోతున్నారు జనాలు. వరుస మరణాలో ప్రజల్లోనూ ఒక రకమైన భయాందోళన నెలకొంది. అయితే, ఈ మరణాలకు కారణం ఏంటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు తినే ఆహారం అని, మరికొందరు కరోనా అని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. గుండె పోటుకు ప్రధాన కారణం..

Andhra Pradesh: శభాష్ ఇంజనీర్ సాబ్.. పూర్వీకుల ఆహార పద్ధతిని వినియోగంలోకి తీసుకువస్తున్న యువకుడు..
Ganuga Nune
Follow us on

ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు కలకం రేపుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి తరువాత ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆఖరికి చిన్న పిల్లలు సైతం ఆకస్మిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. జిమ్ చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వారు మరికొందరు.. ఆన్నం తింటూ కొందరు.. ఆడుకుంటూ కొందరు.. ఇలా చిన్న చిన్న కారణాలతోనే.. ఉన్న చోటనే కుప్పకూలిపోతున్నారు జనాలు. వరుస మరణాలో ప్రజల్లోనూ ఒక రకమైన భయాందోళన నెలకొంది. అయితే, ఈ మరణాలకు కారణం ఏంటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు తినే ఆహారం అని, మరికొందరు కరోనా అని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. గుండె పోటుకు ప్రధాన కారణం.. మన జీవన శైలే అని ప్రధానంగా చెప్పొచ్చు. మనం తినే ఆహారం, మన జీవన విధానమే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది.

మన పూర్వీకులు అంతకాలం జీవించారు.. ఇంతకాలం జీవించారు.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించారని గొప్పలు చెప్పుకుంటాం.. మరి అదే ఆరోగ్యం విషయంలో మన వద్దకు వచ్చే సరికి నోరెళ్లబెడతాం. వారు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారు.. మనం ఎందుకు ఇన్ని సమస్యలతో సతమతం అవుతున్నాం.. అంటే అంతా జీవన శైలే కారణం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని బల్లగుద్ది చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే.. మన ఆరోగ్యం మన చేతిలోనే అంటూ.. ఓ యువకుడు పూర్వీకుల నాటి ఆహారం వైపు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాటి ఆహారాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో వరుస గుండెపోటు మరణాలకు కారణం.. మనం వంటకాల్లో వినియోగించే నూనెనె అని చెబుతున్నాడు ఆ యువ ఇంజనీర్. అందుకే.. ప్రజల ఆరోగ్యం కోసం మన పూర్వీకులు వాడిన గానుగ నూనెను మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా అతనే స్వయంగా గానుగ నూనె తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఆ యువ ఇంజనీర్ కృషికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంజనీరింగ్‌లో పట్టబద్రుడయ్యాడు. నేటి యువతరం అతి పిన్న వయసులోనే అకస్మిక గుండె పోట్లు, అనేకానేక అరోగ్య సమస్యలతో నిత్య జీవనం సాగిస్తున్న వారి కష్టాలను చూసి చలించిపోయాడు. తన వంతుగా ఈ సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని సదుద్దేశంతో గానుగ నూనె తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. తనకు ఉన్న ఏకరం భూమిలో రూ. 10 లక్షలు వ్యయంతో రేకు షెడ్డునిర్మించాడు. అందులో మన పూర్వీకులు అవలంబించిన రెండు ఎద్దుగానుగ (మిషన్లు) కర్రలతో రోలు తయారీ విధానం ద్వారా ఆర్గానిక్ ముడి సరుకులు ఉపయోగించి స్వచ్ఛమైన నువ్వుల నూనె, వేరుశనగ, కొబ్బరి నూనెలను తయారుచేస్తున్నాడు. ఆ నూనెను చుట్టుపక్క గ్రామాల ప్రజలకు సరఫరా చేస్తున్నాడు. తద్వారా వారి మన్ననలను పొందుతున్నాడు యువ ఇంజినీర్ శ్రీనివాస్.

ప్రస్తుతం మన మార్కెట్లో దొరికే వేరుశనగ, నువ్వుల, కొబ్బరి నూనెలు కెమికల్స్‌తో కూడిన ఆయిల్స్ అని తను తయారు చేసే ఎద్దుగానుగా నూనెకు మార్కెట్లో దొరికే వేరుశనగ, నువ్వుల నూనెలకు చాలా తేడా ఉంటుందని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. తను తయారు చేసే విధానంలో కర్రలతో చేసిన రోలులో నిమిషానికి మూడు సార్లు కర్ర రోకలి తిరగడం వలన హీట్ ప్రొడ్యూస్ కాదని, దానివలన నూనెలోని పోషకాలు నిర్వీర్యం కావని చెప్పాడు. అదే ఎలక్ట్రానిక్ మిషన్ లోని ఐరన్ రోలులో నిమిషానికి 40 రౌండ్లు తిరగడం వలన నూనె మరిగి నూనెలో ఉండే పోషకాలు నిర్వీర్యం అవుతాయని చెప్పాడు. దీని కారణంగా మనిషికి కావలసిన పోషకాలు అందక అనేక ఆనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని యువ ఇంజనీర్ శ్రీనివాస్ అంటున్నాడు.

తాము ఎలాంటి కృత్రిమ కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ బెల్లం, వేరుశనగ, నువ్వులతోనే నూనె తయారు చేస్తున్నామని చెప్పారు. రెండు ఎద్దు గానుగ నూనె యూనిట్లను ఉపయోగించి రోజుకు 60 లీటర్లు నూనెలను ఉత్పత్తి చేస్తున్నారు. స్వచ్ఛంగా తయారు చేస్తున్న ఈ నూనెను వినియోగించి ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. నువ్వులు, వేరుశనగ, ఆవ, కొబ్బరి నూనెలను కోనుగోలు చేసి శ్రీనివాస్‌ను మరింత ప్రోత్సహిస్తున్నారు. సాధారణంగా అయితే ఎలక్ట్రానిక్ ఆయిల్ మిషన్ కొనుగోలు చేయడానికి రెండు లక్షల ఖర్చు పెడితే సరిపోతుంది. కానీ పూర్వీకులు విధానంలో ఎద్దు గానుగ నూనె తయారీ యూనిట్‌కి సుమరుగా రూ. 5 లక్షల ఖర్చు అవుతుందని శ్రీనివాస్ తెలిపాడు. దీనికి రెండు బలమైన ఎద్దులు, ఐదుగురు మనుషులను ఉపయోగిస్తున్నామని చెప్పాడు. ప్రజల ఆరోగ్య సౌలభ్యం కోసమే ఈ విధానాన్ని పాటిస్తున్నానని యువ ఇంజనీర్ శ్రీనివాస్ అంటున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..