Viral Video: బాత్రూమ్‌కు వెళ్లేటప్పుడు జర జాగ్రత్త.. గుండె ఆగినంత పనైంది.. కమోడ్ నుంచి.. వామ్మో..

| Edited By: Shaik Madar Saheb

Mar 17, 2025 | 9:22 AM

జనావాసాల్లోకి పాములు వచ్చి చేరుతున్నాయి. భుసలు కొడుతూ భయపెడుతున్నాయి. విశాఖ పెందుర్తిలో.. ఓ విషపూరితమైన నాగు పాము కలకలం రేపింది. వాష్ రూమ్‌లోకి వెళ్ళి కంగారెత్తించింది. కమోడ్‌లో నక్కి భుసలు కొట్టింది. దీంతో అంతా ఒక్కసారిగా హడలెత్తిపోయారు.. చివరకు పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: బాత్రూమ్‌కు వెళ్లేటప్పుడు జర జాగ్రత్త.. గుండె ఆగినంత పనైంది.. కమోడ్ నుంచి.. వామ్మో..
Snake Video
Follow us on

జనావాసాల్లోకి పాములు వచ్చి చేరుతున్నాయి. భుసలు కొడుతూ భయపెడుతున్నాయి. విశాఖ పెందుర్తిలో.. ఓ విషపూరితమైన నాగు పాము కలకలం రేపింది. వాష్ రూమ్‌లోకి వెళ్ళి కంగారెత్తించింది. కమోడ్‌లో నక్కి భుసలు కొట్టింది. దీంతో అంతా ఒక్కసారిగా హడలెత్తిపోయారు.. విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతం ..! చక్రధర్ కుటుంబం ఓ ఇంట్లో నివాసం ఉంటోంది. ఇంట్లో.. వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇల్లంత వెతికితే ఎక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఇక వాష్ రూమ్ తలుపు దగ్గరకు వెళ్లేసరికి ఆ శబ్దాలు మరింత పెద్దగా వినిపిస్తున్నాయి. దీంతో నెమ్మదిగా వాష్ రూమ్ తలుపు తీసిన వాళ్లకు గుండె ఆగేంత పని అయింది. దీంతో పరుగులు తీశారు ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు.. వాళ్లు చూసినది ఏంటో తెలుసా..? భారీ నాగుపాము..

వాష్ రూమ్‌లోకి వెళ్లిన నాగుపాము.. అక్కడి నుంచి కమోడులోకి చొరబడింది.. భుసలు కొడుతూ కనిపిస్తే కాటేసేలా ఉంది. అమ్మో అనుకున్న ఆ కుటుంబం.. ఈ విషయాన్ని ఇరుగుపొరుగుకు చెప్పారు. దీంతో వారు వెంటనే పాములు పట్టడంలో నేర్పరి అయిన స్నేక్స్ సేవర్ సొసైటీ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు.

త్రాచుపాము వీడియో చూడండి..


రంగంలోకి దిగిన కిరణ్ కుమార్.. వాష్ రూమ్‌కు వెళ్లాడు. అక్కడ కమోడ్ లో తిష్ట వేసుకుని ఉన్న భారీ నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. చివరకు ఆ పామును బంధించాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..