విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తిలో మరో అడుగు.. బ్లాస్ట్ ఫర్నేస్‌-3 పునఃప్రారంభం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బ్లాస్ట్‌ ఫర్నేస్-3 ఎట్టకేలకు రీస్టార్ట్‌ అయ్యింది...! అదనంగా 7వేల టన్నుల ఉక్కు ఉత్పత్తికానుంది. మరీ ప్లాంట్‌ ప్రైవేటీకరణ పక్కకు వెళ్లినట్లేనా...? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఈ ఆర్టికల్ మీ కోసం చూసేయండి.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తిలో మరో అడుగు.. బ్లాస్ట్ ఫర్నేస్‌-3 పునఃప్రారంభం
Vizag Steel Plant

Updated on: Jun 27, 2025 | 10:11 PM

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తిలో మరో కీలక అడుగు పడింది. స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్ ఫర్నేస్‌-3ని ఎట్టకేలకు పునఃప్రారంభించారు. ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడిపినప్పుడే నష్టాలను అధిగమించి లాభాలు వస్తాయని ఉక్కు మంత్రిత్వ శాఖ భావించడం, దానికి తగిన నిధులు కేంద్రం సమకూర్చడంతో గత డిసెంబరులో మూతపడిన బీఎఫ్‌-3ను మళ్లీ ప్రారంభించారు. ఇందులో నుంచి రోజుకు ఏడు వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.

మిగిలిన రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల ద్వారా ప్రస్తుతం 14 వేల టన్నులు వస్తోంది. మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లకు అవసరమైన ముడి పదార్థాలను నిరంతర సరఫరా చేస్తే రోజుకు 21 వేల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. అలా ఆరు నెలలు చేస్తే ప్లాంటును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకురావచ్చునని యాజమాన్యం చెబుతోంది. బ్లాస్‌ ఫర్నేస్‌-3పై ఇటు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు మంచిరోజులొస్తాయని భావిస్తున్నారు. కానీ కంపెనీకి లాభాలొస్తాయన్న ఆశలేదంటున్నారు.