హైవేపై ఆగిన కారు.. బానెట్ ఓపెన్ చేసి చూడగా పోలీసులు షాక్..

| Edited By: Srikar T

Aug 23, 2024 | 5:20 PM

రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రోజుకో కొత్త రూటును వెతుక్కుంటున్నారు. పుష్ప సినిమా సీన్స్ తలదన్నే రీతిలో ముందుకుసాగుతున్నారు. టెంపుల్ సిటీలో గంజా విక్రయాలపై కొరడా జులిపిస్తున్న పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. దీంతో గంజాయి అక్రమ రవాణా కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

హైవేపై ఆగిన కారు.. బానెట్ ఓపెన్ చేసి చూడగా పోలీసులు షాక్..
Tirupati
Follow us on

రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రోజుకో కొత్త రూటును వెతుక్కుంటున్నారు. పుష్ప సినిమా సీన్స్ తలదన్నే రీతిలో ముందుకుసాగుతున్నారు. టెంపుల్ సిటీలో గంజా విక్రయాలపై కొరడా జులిపిస్తున్న పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. దీంతో గంజాయి అక్రమ రవాణా కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అక్రమ గంజా నియంత్రణా చర్యల్లో భాగంగా పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిలో వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో దిమ్మ తిరిగే ఘటన ఎదురైంది. ఇతర రాష్ట్రాల వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు కేరళకు చెందిన కారులో లిక్విడ్ గంజాయి గుర్తించారు.

తిరుపతి రూరల్ రామానుజపల్లి సర్కిల్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. పోలీసులను చూసి కారులోని ముగ్గురు యువకులు పరారయ్యారు. కారు బానెట్‎లో గంజాయి దాచి అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్ల యవ్వారం బయట పడింది. కేరళ రిజిస్ట్రేషన్ కారులో ఆరున్నర కిలోల లిక్విడ్ గంజాయిని గుర్తించిన పోలీసులు వాటిని సీజ్ చేశారు. మొత్తం 7 ప్యాకెట్ల రూపంలో లిక్విడ్ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.

ఈ యువకులు వైజాగ్ నుంచి కేరళలోని ఎర్నాకులంకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు తేల్చారు. కారు వదిలి పరారైన ముగ్గురు యువకులు కేరళకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. మామూలు గంజాయి కంటే ఈ లిక్విడ్ గంజాయి ఎక్కువ మత్తును ఇస్తుందని చెబుతున్నారు. దీని విలువ కూడా అధికంగానే ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం పట్టుబడ్డ లిక్విడ్ గంజాయి విలువ దాదాపు రూ. 50 లక్షల మేర ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..