Kapil Dev Meets CM Chandrababu Naidu: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సహా స్థానిక లీడర్లు ఘన స్వాగతం పలికారు. కాగా, కపిల్ దేవ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి విస్తృత కార్యక్రమాల గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
సోమవారం రాత్రి విజయవాడకు చేరుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, మంగళవారం సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. కాగా, ప్రస్తుతం విశాఖపట్నంలో ముడసర్లోవలో ఓ గోల్ప్ కోర్టు ఉందనే సంగతి తెలిసిందే. అమరావతిలో మరో గోల్ప్ కోర్ట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
It was a pleasure to meet with our legendary cricketer and Chairman of the Professional Golf Tour of India, Mr Kapil Dev and his delegation today. We discussed expanding the sports landscape of Andhra Pradesh, with special emphasis on establishing an international golf course… pic.twitter.com/lOJGQTiU7x
— N Chandrababu Naidu (@ncbn) October 29, 2024
చంద్రబాబు హయంలోనే ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఎన్నికలు రావడం, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. జగన్ ప్రభుత్వంలో ఈ గోల్ఫ్ కోర్ట్ ప్రాజెక్టుకు నిధులు కేటాయిచలేదు. దీంతో మరోసారి చంద్రబాబు సీఎం కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Honored to meet cricket legend Shri Kapil Dev today, discussing exciting developments for new stadiums in Amaravati and Vizag. Later met @ncbn garu to explore further possibilities for enhancing sports infrastructure in AP. Great things ahead for cricket enthusiasts!… pic.twitter.com/33wCyjTk0K
— Kesineni Sivanath (@KesineniS) October 29, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..