Andhra Pradesh: నిండు సభలో కంట తడి పెట్టుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా..?

ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అపురూపమైన దశ అని, దాన్ని మధురమైన ఘట్టంగా నిలిపేందుకు పిల్లలకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కలు కల్పించిందన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్.

Andhra Pradesh: నిండు సభలో కంట తడి పెట్టుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా..?
Kakinada District Collector Shanmohan Nagili

Edited By:

Updated on: Nov 20, 2024 | 9:21 PM

చిన్నారుల పట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు చేపడతామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి హెచ్చరించారు. స్థానిక అంబేద్కర్ భవన్ స్టేడియంలో ఐసిడిఎస్, విద్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిధిగా, అసిస్టెంట్ హాజరై వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అపురూపమైన దశ అని, దాన్ని మధురమైన ఘట్టంగా నిలిపేందుకు పిల్లలకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కలు కల్పించిందన్నారు. వారి రక్షణ కొరకు ఫోక్సో వంటి కఠినమైన చట్టాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. అయినప్పటికీ చిన్నారుల పట్ల లైంగిక అకృత్యాలు, హక్కుల హననం కొనసాగడం దురదృష్టకరమని జిల్లా కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లలపై దురాగతాలను అరికట్టవలసిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలలు, బాలికలపై జరుగుతున్న అమానుష సంఘటనల పట్ల ఆవేదనతో కంటతడి పెట్టి కొద్ది సేపు భావోద్వేగానికి లోనయ్యారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. చైల్డ్ సేఫ్ జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దే లక్ష్యంగా జిల్లాలో 6 నెలల పాటు ఉద్యమ కార్యాచరణను అమలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

వీడియో చూడండి..

చైల్డ్ అబ్యూజ్ నివారణకు గుడ్-బ్యాడ్ టచ్ గురించి, బాలబాలికల్లోను, పిల్లల హక్కులు, రక్షణ, పోక్సో చట్టం పట్ల పెద్దలలోను విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. పిల్లల పట్ల ఎవరైనా అనుచితంగాను వ్యవహిస్తే పోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు గైకొంటామని ఆయన స్పష్టం చేశారు. తమ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే బాలలు 1098, 112 హెల్ప్ లైన్లకు ఫోన్ చేయవచ్చునని, 7331126044 నెంబరుకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసి తక్షణ సహాయం పొందవచ్చునన్నారు. అలాగే 112 కంట్రోల్ రూమ్ నెంబరుకు సభకు హాజరైన వారందరి ద్వారా ఫోన్ చేయించి, అత్యవసర రక్షణ పోలీస్ శాఖ ద్వారా ఎలా పొందవచ్చో లైవ్ డెమో ద్వారా కలెక్టర్ వివరించారు. అలాగే, బాలల హక్కుల దినోత్సవం పురస్కరించి జిల్లాలో వివిధ అంశాలలో ప్రతిభను చాటిన విద్యార్థినీ విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ ప్రశంసా పురస్కారాలను అందజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..