అనంతపురం జిల్లా యర్రదొడ్డి టోల్ ప్లాజా దగ్గర సిబ్బందిపై దాడి జరిగింది. కదిరి ఎంపీపీ అమర్నాథ రెడ్డి తన అనుచరులతో వచ్చి హల్ చల్ చేశాడు. తన అనుచరులను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగిస్తున్నారంటూ దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం అర్ధరాత్రి తన అనుచరులతో టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న కదిరి మండల ఎంపీపీ అమర్నాథ రెడ్డి.. టోల్ కార్యాలయంలోని సిబ్బందిని మాట్లాడాలంటూ పక్కకు తీసుకుని వెళ్లి దాడి చేశాడు. దాడి చేసిన అనంతరం ఇద్దరు టోల్ గేట్ సిబ్బందిని తన వెంట తీసుకెళ్లినట్లుగా సమాచారం. అయితే సిబ్బందిపై కదిరి ఎంపీపీ దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
తన అనుచరులను ఉద్యోగం నుండి ఎందుకు తొలగిస్తున్నారంటూ ప్రశ్నించిన ఎంపీపీ అమర్నాథ రెడ్డి అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఆ సిబ్బంది చెప్పిదే కూడా వినిపించుకోకుండా వారిపై దాడి చేయడం మొదలు పెట్టాడు. అతని నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది ఓ సమయంలో పరుగులు పెట్టారు. ఇద్దరు టోల్ గేట్ సిబ్బందిని ఎంపీపీ అమర్నాథ రెడ్డి తనతో పాటుగా తీసుకెళ్లినట్లు సమాచారం..
ఇవి కూడా చదవండి: IRCTC Saptagiri Tour: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. కరీంనగర్, వరంగల్ నుంచి ఐదు వేలకే తిరుపతి స్పెషల్ టూర్..
Telangana Bandh: 317 జీవోను పునఃసమీక్షించాలని ఈ నెల 10న తెలంగాణ బంద్.. పిలుపునిచ్చిన బీజేపీ
Akkineni Nagarjuna: సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు..