
తండ్రి తిట్టాడనే కోపంతో ఓ కుర్రాడు సైకిల్ తీసుకొని ఏకంగా సుమారు 100 కిలోమీటర్లు వెళ్లిన ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తు.. ప్రొద్దుటూరు నగరానికి చెందిన సత్య జితేంద్ర అనే విద్యార్థి తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. అయితే ఈనెల 9వ తేదీన ఏదో విషయంలో జితేంద్రను తండ్రి తిట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సత్య అకతోనే ఆరోజు స్కూల్‌కు వెళ్లాడు. అయితే సాయంత్రం స్కూలు అయ్యాక ఇంటికి రాకుండా నేరుగా సైకిల్ వేసుకొని నంద్యాల దారిపట్టాడు.
దాదాపు 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ రాత్రంతా ప్రయాణించాడు. ఇక ఓపిక లేక ఆ సైకిల్ అక్కడ పడేసి రైలు.. రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ ట్రైన్ ఎక్కి కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లాడు. అయితే రాత్రైనా బాలుడు ఇంటికి రాకపోవడతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ వెతికేందుకు రంగంలోకి దిగారు.
స్కూల్ నుంచి బాలుడు ఎటువైపు వెళ్లాడు అనేది తెలుసుకునేందుకు స్థానికంగా ఉన్న అన్ని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు తనిఖీ చేశారు. ఎట్టకేలకు ఓ ఫుటేజ్‌లో బాలుడు కనిపించాడు. దానికి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మూడు రోజులు తర్వాత రాయిచూర్‌లో బాలుడి అదుపులోకి తీసుకొని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఎందుకు వెళ్లావని పోలీసులు బాలుడిని ఆరా తీయగా తండ్రి తిట్టడంతో వెళ్లిపోయినట్టు తెలిపాడు.
ఇదిగో వీడియో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.