Andhra Pradesh: ఏపీ కొత్త గవర్నర్‌గా ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌.. పలు రాష్ట్రాలకు గవర్నర్‌ల నియామకం..

|

Feb 12, 2023 | 10:16 AM

ఏపీ కొత్త గవర్నర్‌గా ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను నియమించారు రాష్ట్రపతి ముర్ము. ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ఇక ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా మార్చారు.

Andhra Pradesh: ఏపీ కొత్త గవర్నర్‌గా ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌.. పలు రాష్ట్రాలకు గవర్నర్‌ల నియామకం..
Abdul Nazeer
Follow us on

ఏపీ కొత్త గవర్నర్‌గా ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను నియమించారు రాష్ట్రపతి ముర్ము. ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ఈ ఏడాది జనవరి నాలుగో తేదీనే సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన రిటైర్డ్ అయ్యారు. ఇక ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా మార్చారు.

మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా రమేశ్‌ బైస్‌ను రాష్ట్రపతి నియమించారు. భగత్‌సింగ్‌ కొశ్యారీ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదించారు. ఇటీవల ఛత్రపతి శివాజీపై కొశ్యారీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగింది. దాంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు.

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..

–ఏపీ కొత్త గవర్నర్‌గా ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌

–అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్

–సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ ప్రసాద్‌

–జార్ఖండ్‌ గవర్నర్‌గా రాధాకృష్ణన్‌

–హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా శివప్రసాద్‌ శుక్లా

–అసోం గవర్నర్‌గా గులాబ్‌ చంద్‌ కటారియా

–మణిపూర్‌ గవర్నర్‌గా అనసూయ

–నాగాలాండ్‌ గవర్నర్‌గా గణేషన్‌

–మేఘాలయ గవర్నర్‌గా చౌహాన్‌

–బీహార్‌ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌

–మహారాష్ట్ర గవర్నర్‌గా రమేశ్‌ బైస్‌

–లడఖ్‌ గవర్నర్‌గా బి.డి. మిశ్రా

–ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌