సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త ప్రస్థానం.. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని ఎవుసం బాట పట్టి..

|

Jun 24, 2021 | 3:09 PM

JD Laxminarayana: ఆ చేతులతో ఎంతో మంది జీవితాలనే తారు మారులు చేశారు.. ఆ చేతులతో ఎంతో మంది అక్రమార్కుల ఆట కట్టించారు..

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త ప్రస్థానం.. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని ఎవుసం బాట పట్టి..
Jd Laxmi Narayana
Follow us on

JD Laxminarayana: ఆ చేతులతో ఎంతో మంది జీవితాలనే తారు మారులు చేశారు.. ఆ చేతులతో ఎంతో మంది అక్రమార్కుల ఆట కట్టించారు.. ఆ చేతులతో ఎంతోమందిని ఖైదు చేయించారు.. ఆ చేతులతోనే ఎంతో మందిచే ఆదర్శపాఠాలు దిద్దించారు. ఇప్పుడు అదే చేతులతో తన జీవితంలో సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు. ఆయనే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఇప్పటికే సీబీఐకి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేసిన లక్ష్మీనారాయణ.. ఇప్పుడు సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా.. నాగలి పట్టి రైతుగా మారారు. ఎడ్ల నాగలితో దుక్కి దున్ని వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో 12 ఎకరాలు కౌలుకు తీసుకున్న లక్ష్మీనారాయణ.. నేటి నుంచి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే ఇవాళ్టి నుంచి ఆయన వ్యవసాయ పనులు ప్రారంభించారు.

వ్యవసాయ పనులు ప్రారంభించిన సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. కరోనా కాలంలో మన దేశంలో వ్యవసాయ రంగం మాత్రమే ముందుకు వెళ్లగలిగిందని పేర్కొన్నారు. దేశ వ్యవసాయరంగంలో 3.6 శాతం వృద్ధి రేటు నమోదైందని ఉటంకించారు. రైతన్నల చలవ వల్లే దేశంలో గోడౌన్లు ఆహార ధాన్యాలతో నిండిపోయాయని పేర్కొన్నారు. తాను వ్యయం చేస్తూ సాయం చేసేవాడు వ్యవసాయదారుడు అని రైతన్నల శ్రమను కీర్తించారు లక్ష్మీనారాయణ. వ్యవసాయంలో ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తన అనుభవం ద్వారా వ్యవసాయంలో రావాల్సిన మార్పులపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తానని పేర్కొన్నారు. పురుగుల మందులు చల్లడంలో డ్రోన్ల టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి రావాలని లక్ష్మీనారాయణ అభిలషించారు.

Also read:

టిక్ టాక్ మోజు…….తల్లి మందలించిందని ఇంటి నుంచి పారిపోయిన టీనేజర్…..చివరకు …

WTC Final 2021: డబ్ల్యూటీసీ మొదటి ఎడిషన్‌లో ఆటగాళ్ల ఫర్‌ఫార్మెన్స్‌; టీమిండియా నుంచి రహానే, అశ్విన్ మాత్రమే!

On This Day: 17 ఓవర్లలో 42 పరుగులకు ఆలౌట్.. టీమిండియా పతనానికి ఆ బౌలరే కారణం.! ఎవరంటే.?=