JD Laxminarayana: సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. విద్య, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి..

| Edited By: Sanjay Kasula

Oct 27, 2023 | 4:02 PM

అరెస్టు చేసిన వారే పొగిడితే అందులో ఉండే మజా వేరే చెప్పక్కర్లేదు. సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. శ్రీశైలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ జగన్‌ పాలనపై ప్రశంసలు కురిపించారు..విద్య, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి మంచి ఫలితం ఉంటుందన్న లక్ష్మీనారాయణ నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ప్రశంసించారు.. అదేందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..

JD Laxminarayana: సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. విద్య, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి..
Jd Laxminarayana
Follow us on

శ్రీశైలం, అక్టోబర్ 27: విమర్శలు చేసిన వారే తెగ పొగిడితే ఆకిక్కే వేరు. అలాంటిది అరెస్టు చేసిన వారే పొగిడితే అందులో ఉండే మజా వేరే చెప్పక్కర్లేదు. సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. శ్రీశైలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ జగన్‌ పాలనపై ప్రశంసలు కురిపించారు..విద్య, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి మంచి ఫలితం ఉంటుందన్న లక్ష్మీనారాయణ నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ప్రశంసించారు.. అదేందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తాను చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు లక్ష్మీనారాయణ శ్రీశైలం వెళ్లారు. అయితే, శ్రీశైలంలోనే ఉన్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఉన్నారని తెలుసుకుని పూర్వ విద్యార్థుల సమావేశానికి రావాలంటూ ఆహ్వానించేందుకు వెళ్లారు. అదే సమయంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరుగుతోంది. జేడీ లక్ష్మీనారాయణ చూసిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి స్టేజి మీదికి లక్ష్మీనారాయణ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సీఎం పరిపాలన పైన ప్రశంసల వర్షం కురిపించారు. నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని కొనియాడారు. అంగన్వాడీలలో చిన్నపిల్లలకు పౌష్టికాహారం రాగిజావ ఇవ్వడపై ప్రశంసలు కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు. బాధితుల దగ్గరకే డాక్టర్లు వెళ్లి పరీక్షలు చేయడం.. మందులు ఇవ్వడం పట్ల మంచి పరిణామం అన్నారు. ఎవరైతే విద్యా వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో వారికి అంతే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందని అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

జగన్మోహన్ రెడ్డిని వివిధ కేసులలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి లక్ష్మీనారాయణ అదే జగన్ పరిపాలనను అభినందించడం ప్రశంసల జల్లు కురిపించడం పట్ల సర్వత్రా చర్చగా మారింది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..