Pawan Kalyan vs YCP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, ఈ సారి మరింత పదునైనా ఆరోపణలతో ట్వి్ట్టర్ వేదికగా కత్తులు దూస్తున్నారు. రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ పేరిట ఒక డయాగ్రమ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. దానికి క్యాప్షన్‌గా పలు విమర్శలతో కూడిన కామెంట్స్ చేశారు. ‘‘ఎన్ని వాగ్దానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా.. రాష్ట్ర బడ్జెట్‌ని ఎంత మసిపూసి మారేడు కాయ చేసినా.. ‘సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేరు. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు.’ ఈ మౌలిక ఆర్థిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్లుంది.’’ అంటూ ఫైర్ అయ్యారు.
అలాగే ఫోటో డయాగ్రామ్‌లో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను తూర్పారబడుతూ.. రాష్ట్రంలో అసలేం జరుగుతుందనేది ప్రజలకు తెలిసేలా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘వైసీపీ ప్రభుత్వం పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలకు ఉదారంగా ఇస్తున్నది రూపాయి అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక వద్ధి పావలా వంతు. విద్యుత్ బిల్లులు, నిత్యావసరాల ధరలు, ఇతర ధరల పెంపుతో ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నది రూపాయి బిల్లంత అయితే.. వైసీపీ ప్రభుత్వం భావితరాలకు ఇస్తున్న కానుక-అప్పులు, వడ్డీ, చక్రవడ్డీలు కోడిగుడ్డంత’’ అంటూ బొమ్మల రూపంలో వివరిస్తూ విమర్శలు గుప్పించారు.
Pawan Twitter:
ఎన్ని వాగ్దానాలు చేసినా
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా‘సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు’ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని ‘వైసీపీ ప్రభుత్వం’ మరిచినట్టుంది. pic.twitter.com/S5mHzwizV9
— Pawan Kalyan (@PawanKalyan) October 8, 2021
Also read:
Varudu Kaavalenu : దసరా రేస్ నుంచి తప్పుకున్న నాగశౌర్య.. వెనక్కితగ్గిన ‘వరుడు కావలెను’..?