Pawan Kalyan Press Meet: ఒంగోలు పర్యటన లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశామయ్యారు. ఈ సమావేశంలో ప్రముఖ స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగనిరతి, ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిలో దేశభక్తిని నింపుతాయని.. దేశం కోసం చేసిన సేవలు అందరికీ ఆదర్శమన్నారు. ఆయన స్ఫూర్తి , దైర్యం తరతరాలకు ఆదర్శమని చెప్పారు. మతం కంటే మానవత్వం గొప్పదనే స్ఫూర్తి నింపాలి చెప్పారు. సెక్యులరిజం అంటే చర్చి, మసీదుల మీద దాడులు జరిగితే గొంతు ఎత్తి.. ఆలయాల మీద దాడులు జరిగితే మాట్లాడకుండా ఉండడం సెక్యులిజం కాదని అన్నారు.
జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబంపై ఎమ్మెల్యే రాంబాబు, వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు… ప్రశ్నించిన గొంతు నొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఒక యువకుడు ప్రభుత్వంలోని లోపాలను బాధ్యతగా ఎత్తిచూపితే.. ఎమ్మెల్యే వీలయితే చేస్తామని.. లేదంటే లేదని చెప్పాలి.. అంతేకాని ఆ మనిషిని మానసికంగా హింసించి ఆత్మహత్యకు పాల్పడే విధంగా చేయడం దారుణమని అన్నారు. తాము ఇచ్చిన 8.5 లక్షలు ఆ కుటుంబానికి ఆర్ధికంగా అండగా ఉంటాయి కానీ.. ఆ కుటుంబం కోల్పోయిన మనిషిని తిరిగి తీసుకునిరాలేమని చెప్పారు..
తప్పు జరిగిందని ప్రశ్నిస్తే.. ఆ గొంతుని నొక్కేయడం దారుణమని ఆవేదనవ్యక్తం చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే రాంబాబు అవ్వవచ్చు ఎవరైనా కావచ్చు .. వారు రాజ్యాంగానికి అతీతులు కారని తెలిపారు.
Also Read:
ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య ఫ్యామిలీని పరామర్శించిన పవన్ కళ్యాణ్. ఆర్ధిక సాయం అందజేత