Janasena Committee: విజయవాడ,నెల్లూరు నగర జనసేన పార్టీ కమిటీల నియామకం.. ఆమోదం తెలిపిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ బలోపేతంపై అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. సంస్థాగతంగా బలపడేందుకు పక్కా వ్యుహంతో వెళ్తున్నారు.

Janasena Committee: విజయవాడ,నెల్లూరు నగర జనసేన పార్టీ కమిటీల నియామకం.. ఆమోదం తెలిపిన పవన్ కళ్యాణ్
Janasena Party Pavan Kalyan

Updated on: Jul 28, 2021 | 7:59 PM

Janasena Party Committees: జనసేన పార్టీ బలోపేతంపై అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. సంస్థాగతంగా బలపడేందుకు పక్కా వ్యుహంతో వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసిన పార్టీ హైకమాండ్.. తాజాగా అయా జిల్లాల కమిటీలను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. విజయవాడ, నెల్లూరు నగర జనసేన పార్టీ కమిటీల నియామకంతో పాటు వివిధ కమిటీకి జనసేనాని పవన్ కల్యాణ్ ఆమోద ముద్ర వేశారు.

జనసేన పార్టీ విజయవాడ, నెల్లూరు నగరాలకు 64 మందితో ఏర్పాటైన కమిటీకి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒకే చెప్పారు. విజయవాడ నగర అధ్యక్షులుగా పోతిన మహేష్‌ను నియమించగా, నెల్లూరు నగర అధ్యక్షులుగా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేరును ప్రకటించారు. అలాగే ప్రతి జిల్లా కమిటీలో ఇద్దరు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 12 మంది కార్యదర్శులు, 13 మంది సంయుక్త కార్యదర్శులు, కార్యనిర్వహణ సభ్యులతో కూడిన జాబితాను జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విడుదల చేశారు.

Read Also…  AP Curfew: ఏపీలోని ఆ ప్రాంతాల్లో వారం రోజుల పాటు కర్ఫ్యూ.. ఎక్కడెక్కడంటే.?