
లోకల్ ఫైట్‌కి రెడీ అంటోంది జనసేన.. గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు.. ఇప్పుడే స్కెచ్ మొదలుపెట్టింది. బలం ఉన్న చోట బరిలోకి.. గెలిచే గుర్రాలకే టికెట్లు అంటోంది. లోకల్ ఎలక్షన్స్‌లో సత్తా చాటి.. అదే ఊపుతో నెక్స్ట్ అసెంబ్లీ ఫైట్‌కి వెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ భారీ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు.. 50 నుంచి 60 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
జనసేనకు ఇప్పుడు లోకల్ టెస్ట్ మాత్రమే కాదు..! నెక్స్ట్ అసెంబ్లీ వార్‌కి.. ఇదే రిహార్సల్ కూడా. అందుకే క్యాడర్ ఎంతుంది..? కలిసి వచ్చే లీడర్లు ఎవరు..? ఏ నియోజకవర్గంలో పార్టీకి పట్టు ఉంది..? ఎక్కడ గెలిచే ఛాన్స్ ఉంది..? వీటన్నింటిపైనా ఇప్పుడు జనసేన ఫోకస్ పెట్టింది. అందులోభాగంగానే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఇప్పటికే నియమించిన జనసేన… నిన్నటికి నిన్న లోకల్ ఎలక్షన్ కోఆర్డినేటర్లు, కోఆర్డినేషన్ టీమ్స్, సపోర్ట్ టీమ్స్‌తో కీలక సమావేశం నిర్వహించింది. లోకల్ ఫైట్‌పై నేతలకు కీలక సూచనలిచ్చింది.
సీట్లు ఎక్కువ కావాలి అనేది కాదు.. గెలిచే సీట్లు కావాలి. కూటమి ధర్మం పాటిస్తూనే.. జనసేనకు బలం ఉన్న ప్రతి చోటా పోటీకి సిద్ధం కావాలని కమిటీలకు స్పష్టమైన టార్గెట్ ఇచ్చింది అధిష్టానం. గత ఎన్నికల్లానే ఈసారి కూడా 100 పర్సెంట్ స్ట్రైక్ రేటే లక్ష్యమంటున్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి..
ఇదే సమయంలో అమలాపురంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. బలం ఉన్న అన్ని చోట్లా పోటీ చేస్తాం… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 నుంచి 60 స్థానాల్లో నిలబడేలా బలం పెంచుకుంటామనడం జనసేన నెక్స్ట్ ప్లాన్‌పై ఆసక్తిని పెంచింది.
లోకల్ ఫైట్‌లో సత్తా చాటి కేడర్‌లో కొత్త ఊపు తీసుకురావడమే కాదు… నియోజకవర్గాల్లో పట్టు పెంచుకుని అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధిక స్థానాల్లో తమ అభ్యర్థులు నిలబెట్టేలా జనసేన కొత్త గేమ్ ప్లాన్‌గా కనిపిస్తోంది. మొత్తంగా… జనసేనకు ఇప్పుడు ప్రతి లోకల్ సీటు చాలా ఇంపార్టెంటే. ప్రతి గెలుపు.. నెక్స్ట్ అసెంబ్లీ వార్‌కు ఓ అడుగే. మరి లోకల్ ఫైట్‌లో జనసేన ఎంతవరకు సక్సెస్ అవుతుంది..? ఆ గెలుపు 50–60 అసెంబ్లీ సీట్ల టార్గెట్‌కు రీచ్ అయ్యేలా చేస్తుందా…? అన్నది చూడాలి.