
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ సునామీకి వైసీపీ కొట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై గతంలో ఎన్నడూ లేనంత విధంగా 70,354 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు పవన్ కళ్యాణ్ గెలిచిన విషయాన్ని తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇక టీవీ స్క్రీన్‌పై పవన్ విజయాన్ని చూసి.. ఆయన సోదరి కాస్త ఎమోషనల్ అయ్యారు. కాగా, కుటుంబ సభ్యులు, జనసైనికులతో కలిసి పిఠాపురంలో నాగబాబు ఎన్నికల ఫలితాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక పవన్ విజయంతో జనసైనికులు సంబరాల్లో మునిగిపోయారు.
అటు జనసేన అభ్యర్ధులు పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లోనూ ముందంజలో ఉన్నారు. ఇప్పటికే 6 స్థానాల్లో జనసేన విజయభేరి మోగించగా.. మిగిలిన స్థానాల్లోనూ ఆధిక్యతలో కొనసాగుతున్నారు జనసేన అభ్యర్ధులు. ఇదిలా ఉంటే.. కాసేపట్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. చంద్రబాబుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..