నేడు భీమవరానికి జనసేనాని

జనసేనా పార్టీ చీఫ్ పవన్‌ కళ్యాణ్‌ జిల్లాల పర్యటనకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. పరాజయంతో ఒకింత నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు.. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు సిద్ధాంతం బ్రిడ్జి వద్ద పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. సిద్ధాంతం బ్రిడ్జి నుంచి సిద్ధాంతం గ్రామం మీదుగా పెనుగొండ, మార్టేరు, బ్రాహ్మణ చెరువు, నవుడూరు, వీరవాసరం, శృంగవృక్షం గ్రామాల మీదుగా భీమవరం చేరుకుంటారు. అనంతరం పట్టణంలో […]

నేడు భీమవరానికి జనసేనాని

Edited By:

Updated on: Aug 04, 2019 | 9:43 AM

జనసేనా పార్టీ చీఫ్ పవన్‌ కళ్యాణ్‌ జిల్లాల పర్యటనకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. పరాజయంతో ఒకింత నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు.. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు సిద్ధాంతం బ్రిడ్జి వద్ద పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. సిద్ధాంతం బ్రిడ్జి నుంచి సిద్ధాంతం గ్రామం మీదుగా పెనుగొండ, మార్టేరు, బ్రాహ్మణ చెరువు, నవుడూరు, వీరవాసరం, శృంగవృక్షం గ్రామాల మీదుగా భీమవరం చేరుకుంటారు.
అనంతరం పట్టణంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ అంశాలతో జనసేన సైనికులతో మాట్లాడతారు.